షోలే’… ఇది రెండు అక్షరాలు కాదు.. భారత సినిమా చరిత్రలో రికార్డులు తిరగరాయడం కాదు కొత్త రికార్డులు సొంతం చేసుకున్న సినిమా. 1975 ఆగస్ట్ 15న రిలీజైన ‘షోలే’ భారతీయ చలన చిత్రసీమని ఓ ఊపు ఊపేసింది. యాక్షన్ అడ్వంచర్‌గా ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డుల్ని ఇప్పటిదాకా మరో చిత్రం బ్రేక్ చేయలేదంటే ‘షోలే’ స్టామినా ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయిందే అంతేకాకుండా పాకిస్తాన్లో ఈ సినిమా తొలిసారిగా విడుదలైంది. భారత్ లో రికార్డుల వరద సృష్టించి ఇండియన్ సినిమా స్టెమినాను చూపించిన షోలే పాక్ లో విడుదలపై మరింత వివరాలు మీకోసం..
‘షోలే’ చిత్రం భారత్‌లో రిలీజై దాదాపు 40 సంవత్సరావుతోంది. ఎన్నో దేశాల్లో ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతటి విజయం సాధించిన ఈ చిత్రం ఇంతవరకు పాకిస్తాన్లో విడుదల కాలేదు. అంతకుముందు ఎన్నో భారతీయ సినిమాలు పాకిస్తాన్లో రిలీజైనా ‘షోలే’ని విడుదల చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. దీని వెనక కారణాలు తెలియదుగానీ తాజాగా పాక్‌లోని వన్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూటర్ నదీమ్ మండ్వీవాలా ‘షోలే’ని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా ఈనెల 17న ఈ చిత్రాన్ని పాక్ థియేటర్లలో 2డీ, 3డీ ఫార్మాట్లో విడుదల చేశారు. అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత దాయాది దేశంలో ‘షోలే’ రిలీజ్ అయిందన్నమాట. అమితాబ్, ధర్మేంద్ర, సంజీవ్‌కుమార్, హేమమాలిని, జయబాధురి, అంజాద్‌ఖాన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఆర్.డి.బర్మన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని జి.పి.సిప్పీ నిర్మించగా రమేష్ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన ‘షోలే’ పాక్‌లో కూడా తడాఖా చూపిస్తోందట. రెండు రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయినా రికార్డులు షేక్ చెయ్యడం రికార్డ్ స్థాయిలో వసూలు రాబట్టడం షోలే ఇప్పుడే కాదు 40 ఏళ్ల కిందే చేసింది. తాజాగా దాయాది దేశంలోనూ సత్తా చాటుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more