తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ.. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లను పొందింది. ఈమె నటించిన మూవీల్లో చాలావరకు ఫ్లాప్ అయినప్పటికీ వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు పరిశ్రమ వల్లే ఈమెకి మంచి క్రేజ్ లభించింది. అయితే.. కాలక్రమంలోనే కొత్త తారల హవా తెలుగులో కొనసాగిన నేపథ్యంలో ఈమెకి ఆఫర్లు కరువయ్యాయి. దీంతో ఈ అమ్మడు ఇతర భాషచిత్రరంగాలవైపు దృష్టి సారించింది. ఆమె చేసిన చివరి తెలుగు సినిమా 2013లో విడుదలైన ‘సాహసం’ కాగా, అదే సంవత్సరంలో ‘ఆరంభం’ అనే డబ్బింగ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ కనిపించలేదు.
ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు తమిళంలో నటించిన ‘కాంచన 2′ సినిమా.. తెలుగులో ‘గంగ’ పేరుతో విడుదలకు సిద్ధంగా వుంది. తమిళంలో ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. నిజానికి తెలుగులోనూ ఈ సినిమా గత వారమే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా అనుకున్న విధంగానే మంచి రివ్యూలను సంపాదించింది. ఇందులో లారెన్స్ నటనతో పాటు తాప్సీ, నిత్యామీనన్‌ల నటన కూడా బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటిసారిగా ఓ భయపెట్టే తరహా పాత్రను చేసిన తాప్సీ, అన్ని విధాలా ఆకట్టుకుంది. ఈ మూవీతో తమిళంలో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఇప్పుడు తెలుగులో విడుదల అయ్యేందుకు సిద్ధంగా వున్న ఈ మూవీని ఇక్కడి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ఆసక్తి నెలకొంది. తెలుగులోనూ ఇది మంచి విజయం సాధిస్తే.. నిర్మాతకు కాసులవర్షం కురవడమే కాకుండా.. నటీనటుల కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు. అందులోనూ తాప్సీకి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని, ఇప్పటికే తమిళంలో ఆమె నటనకు మంచి మార్కులు పడిన నేపథ్యంలో తెలుగులోనూ అలాగే మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు. మరి.. ఈ మూవీ తాప్సీకి తెలుగులో ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే!
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లో మూడో సినిమాగా ‘గంగ’ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. రెండేళ్ళుగా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించని తాప్సీ, మళ్ళీ గంగ సినిమా ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more