బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె సంచలనాలకు మారుపేరుగా నిలుస్తోంది. గతంలో నిత్యం బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ వార్తల్లోకెక్కిన ఈ నటి.. ఆ తర్వాత తన దృష్టి సినిమాలవైపుకు మళ్లించి అందనంత ఎత్తుకు ఎదిగింది. ఇలా కొన్నాళ్లవరకు మంచి ఇమేజ్ ని క్యాష్ చేసుకుని గౌరవం పొందింది. ఏ తారకు దక్కని విలువ అనతికాలంలోనే ఈమెకి దక్కింది. అయితే.. తర్వాత కొన్నాళ్లకే ‘క్లీవేజ్’ విషయమై ఈమె మళ్లీ వార్తల్లోకెక్కింది. అప్పుడు ఓ వార్తాపత్రిక ఈమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి వార్తలు రాయగా.. దానిపై మండిపడింది. అప్పుడు ఈమెకు మద్దతుగా ఎందరో తారలు నిలవడంతో ఈ వివాదంలో ఈమే గెలిచింది.
కానీ.. ఇటీవలే ‘విమెన్ ఎంపవర్ మెంట్’ కోసం ఈమె ‘మై ఛాయిస్’ పేరిట ఓ వీడియో చేసి.. ఇన్నాళ్లూ దక్కించుకున్న గౌరవాన్ని మంటలో కలిపేసుకుంది. ఆ వీడియోలో తాను పెళ్లికిముందు, తర్వాత ఎవరితోనైనా శారీరక సుఖాన్ని పొందుతానని, తన శరీరాన్ని ఎలాగైనా వినియోగించుకున్న హక్కు వుందంటూ ఆమె పాటలో రాగాలు పలికింది. దీంతో విమెన్ ఎంపవర్ మెంట్ అంటే కేవలం చిన్న బట్టలు వేసుకోవడం కాదని, ఎవరితోపడితే వారితో శారీరక సుఖం పొందడం కాదంటూ ఆమెకు కౌంటర్లు వచ్చిపడ్డాయి. మొత్తంగా ఆ వీడియోతో విమర్శల మూట కట్టుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడు తన జోరు తగ్గించడం లేదు. తాజాగా ఇచ్చిన ఫోటోషూట్ లో హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.
ఫోటో షూట్ల విషయంలో ముందునుంచే చాలా అడ్వాన్స్ గా వుంటూ వస్తున్న ఈ అమ్మడు.. తాజాగా మరోసారి ‘ఫిల్మ్ ఫేర్ మేగజైన్’ మే నెల సంచిక కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. అంతేకాదు.. ఈ నేపథ్యంలో ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమలోని చీకటి కోణాల గురించి, యాక్టర్ల కంటే తాను తక్కువ పారితోషికం అందుకుంటున్న పరిణామాలపై, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకొచ్చింది. అలాగే.. ఇటీవల తాను విడుదల చేసిన ‘మై చాయిస్’ వీడియోపై విమర్శలు, అంతకు ముందు తన క్లీవేజ్ షోపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించింది.
ఆ రెండు వివాదాల్లో తనమీద వచ్చిన విమర్శలు తనపై ఏమాత్రం ప్రభావం చూపవని ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది. తానెప్పుడూ పాజిటివ్ దృక్ఫథంతో ముందుకు సాగుతానని.. తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోవడం కంటే ముఖ్యమైన విషయాలు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇటు పర్సనల్ లైఫ్ విషయంలోనూ....అటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాల్లోనూ తాను ఎంతో సంతోషంగా ఉన్నానని దీపిక పదుకునె తెలిపింది. అంటే.. తనమీద ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా తన శైలి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదన్న భావనను ఆమె వ్యక్తపరిచింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more