Singer Sunitha Denies Rumours About Offer in Mahesh babu Bramhotsavam Movie

Singer sunitha denies rumours mahesh babu bramhotsavam special role

singer sunitha news, singer sunitha hot news, singer sunitha photos, sunitha photo shoot, sunitha songs, sunitha affairs, sunitha scandals, sunitha hot photo shoot, sunitha marriage, sunitha rumours, sunitha gossips, sunitha mahesh babu, bramhotsavam, srikanth addala

Singer Sunitha Denies Rumours Mahesh babu Bramhotsavam Special Role : Finally singer sunitha denies rumours of special role in mahesh babu latest flick Bramhotsavam. She told that.. the movie unit not yet called her for that role.

‘అవునా..? నిజమా..? నన్నైతే సంప్రదించలేదు!’

Posted: 04/22/2015 04:29 PM IST
Singer sunitha denies rumours mahesh babu bramhotsavam special role

తన మధురస్వరంతో కొన్ని వందల సినిమాల్లో ఎన్నో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించింది సింగర్ సునీత! అంతేకాదు.. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెబుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమాలోని హీరోయిన్స్ తమ అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేస్తే.. ఈమె తెరవెనుకే వుంటే తన గాత్రంతో మాయ చేసేసింది. మొత్తానికి ఈమె కూడా ఓ స్టార్ స్టేటస్ ను క్రియేట్ చేసుకుంది.

ఇదిలావుండగా.. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సునీత ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ప్రచారం జరిగింది. గతంలో ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరిస్తూ వచ్చిన సునీత.. తాజాగా మహేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధిక ప్రాధాన్యత గల పాత్ర లభించిన నేపథ్యంలో ఈమె అందుకు ఓకే చెప్పి వుంటుందని అంతా అనుకున్నారు.

అయితే.. తాను మహేష్ సినిమాలో నటిస్తున్నట్లుగా వచ్చిన ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనంటూ సునీత తాజాగా స్పష్టం చేసింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో పాత్రకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె తెలిపింది. ఇదే విషయమై ఆమె ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవం సినిమాలో నేను నటిస్తే బాగుంటుందన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందేమో తెలీదు కానీ ఆ విషయమై నన్నైతే ఎవరూ సంప్రదించలేదు’ అంటూ రూమర్లను ఖండించింది.

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ... ‘పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం నాకిష్టమైన విషయాలు. ఇక యాక్టింగ్ అనేది చాలా కష్టమైనది. అయితే ‘యాక్టింగ్ అనేదే చేయను’ లాంటి ప్రకటనలు మాత్రం చేయను. ఏదైనా సంగీత ప్రధాన సినిమా గానీ, ఆఫ్ బీట్ సినిమా గానీ వస్తే ఆలోచిస్తానేమో!’ అంటూ అభిప్రాయం వ్యక్తపరిచింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bramhotsavam  singer sunitha  mahesh babu  srikanth addala  

Other Articles