Ram charan tej express his happy feelings about his latest flick abroad shooting | tollywood | rakul preet singh

Ram charan tej express his happy feelings about his latest flick abroad shooting

ram charan tej, ram charan new movie, ram charan srinu vaitla movie, rakul preet singh, ram charan facebook, ram charan twitter, ram charan controversies, rakul preet singh updates

Ram charan tej express his happy feelings about his latest flick abroad shooting : Ram charan tej express his happy feelings about his latest flick abroad shooting like this.. Loved the songs we shot abroad.after a long time I danced this fast. Difficult but enjoyed. On r way back to India for the next schedule.

ఆ ‘ఫాస్ట్’ అనుభవాన్ని ఎంజాయ్ చేసిన చెర్రీ

Posted: 06/01/2015 11:33 AM IST
Ram charan tej express his happy feelings about his latest flick abroad shooting

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన మూవీకి సంబంధించిన విషయాల్లో చాలా కేర్ తీసుకుంటాన్న విషయం తెలిసిందే! ఒకే తరహా ట్రెండ్ ఫాలో అవడం కాకుండా సరికొత్తగా ప్రయోగాలు చేస్తుంటాడు ఈ నటుడు. తనని తాను స్టైలిష్ గా మార్చుకోవడం, తనదైన మ్యానరిజంతో కొత్తగా యాక్షన్ పండించడం, ప్రేక్షకులు ఉర్రూతలూగేలా స్టెప్పులు వేయడం.. ఇలా ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక వెరైటీతో ఈ హీరో ముందుకొస్తాడు. ఈ తరహాలోనే తాను నటిస్తున్న తాజా చిత్రంలో ‘ఫాస్ట్’ అనుభవాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్లుగా చెర్రీ వెల్లడించాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ‘నా పేరు రాజు’ అనే టైటిల్ పరిశీలనలో వున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల యూరప్ లోని కొన్ని లొకేషన్లలో జరిగింది. ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలతోపాటు పాటలు కూడా అక్కడ షూట్ చేశారు. ఈ షూటింగ్ నేపథ్యంలో తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని, చాలా కాలం తర్వాత తాను అక్కడ చిత్రీకరించిన పాటల్లో క్లిష్టపరమైన ఫాస్ట్ మూవ్ మెంట్స్ చేశానని చెర్రీ వెల్లడించాడు.

ఈ షూటింగ్ వ్యవహారం గురించి చరణ్ వెల్లడిస్తూ.. ‘అబ్రాడ్ లో తీసిన పాటలని బాగా ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత వీటిలో ఫాస్ట్ డ్యాన్స్ చేశాను. ఈ మూవ్ మెంట్స్ క్లిష్టంగా వున్నప్పటికీ.. ఎంజాయ్ చేశాను. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని, తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ వస్తున్నాం’ అని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  rakul preet singh  srinu vaitla  

Other Articles