ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ చిత్రాన్ని ఛార్మికౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. మరియు శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్స్ పై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఛార్మి మరియు నటి శ్యామల యాంకరింగ్ చేసి అందరిలో హూషారెత్తించారు. ఆడియో సిడీని పూరీ జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని ఛార్మీకి అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఛార్మి మాట్లాడుతూ... ఇప్పటివరకూ హీరోయిన్ గా కెమెరా ముందుండి పనిచేసాను. మొదటిసారిగా కెమెరా వెనక వుండి ఈ సినిమాకు పనిచేసాను. తెర వెనుక టెక్నీషియన్స్ కష్టం ఎంత వుంటుందో ఈ చిత్రం ద్వారా నాకు అర్థమయ్యింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు అన్నీ పూరీగారే. సినిమా చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా నిర్మించారు. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా నా కెరీర్ కు చాలా స్పెషల్ మూవీ. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.... నలభై ఐదు సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ‘మిసెస్ పరాంకుశం’ కథ ఇది. సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ కథ ఛార్మి చెప్పాను. కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమా చెయ్యాలంటే ఒక పవర్ హౌస్ కావాలి. ఒక ఎనర్జీ వున్న అమ్మాయి కావాలి. ఛార్మి ఇందులో ఇరగొట్టేసింది. యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ సైడ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ సినిమాకు పనిచేసిన వారందరికి థ్యాంక్స్. ‘జ్యోతిలక్ష్మీ’ హిట్ మా అందరికీ కొత్త ఎనర్జీని, ఇలాంటి చిత్రాలు చెయ్యడానికి కొత్త ధైర్యాన్ని ఇవ్వబోతుంది. తర్వాత ‘జ్యోతిలక్ష్మీ-2’ కూడా చెయ్యాలని కోరిక. ఈ సినిమా క్రెడిట్ అంతా ఛార్మికే చెందుతుంది అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more