Comedian Ali insulted At Nandi Natakotsavam

Comedian ali insulted at nandi natakotsavam

Actor Ali latest news, Actor Ali insulted, Actor Ali in rajumundry, Actor Ali latest updates, Actor Ali movie news, Actor Ali movie updates, Actor Ali police insulted, Actor Ali news, Actor Ali

Comedian Ali insulted At Nandi Natakotsavam: Actor Ali Clash With security At Nandi Natakotsavam in Rajamundry.

నటుడు ఆలీని పిలిచి మరీ అవమానించారట

Posted: 06/08/2015 11:34 AM IST
Comedian ali insulted at nandi natakotsavam

తెలుగు సినీ అభిమానులందిరికీ నటులు ఆలీ బాగా సుపరిచితుడే. అలాంటి ఆలీని కొంతమంది పోలీసులు తమ అత్యుత్సాహం ప్రదర్శించి అవమానించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆలీకి తన సొంత ఊరిలో ఘోర అవమానం జరిగింది.

ఇంతకీ అసలు విషయమేమిటంటే... ఇటీవలే ఆలీ తన సొంత ఊరైన రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లాడు. అక్కడ తనకు మంచి ఆదారణ లభిస్తుందని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమం వేదికపైకి ఆలీ వెళ్లడానికి ప్రయత్నించినపుడు అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

తాను ఆలీనని, ఈ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చానని ఎంత చెప్పినప్పటికీ పోలీసులు తన మాట వినిపించుకోలేదు. దీంతో ఇక చేసేదేమి లేక అవమానంగా భావించిన ఆలీ అక్కడి నుంచి వెనక్కి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. కానీ అదే వేదికపై వున్న సినీనటుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్.. ఈ విషయాన్ని గమనించి వెంటనే కిందకి వచ్చి, ఆలీని వేదికపైకి తీసుకెళ్లారు.

కానీ వేదికపైకి ఎక్కిన కూడా అసహనంతోనే వున్నారు. నాటకోత్సవాల కోసం తన సొంత ఊరికి వచ్చినందుకు తనకు మంచి మర్యాదే జరిగిందంటూ ఆలీ తన అసహానాన్ని వ్యక్తం చేసారు. అయితే ఆ తర్వాత ఆలీ ఆ కార్యక్రమ సభ్యులు, యూనిట్ క్షమాపణలు కోరినట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Ali  insulted  Nandi Natakotsavam  Rajahmundry police  

Other Articles