పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్... ఆ తర్వాత పవన్ తో దాదాపు 9ఏళ్లు సహజీవనం కొనసాగించి, ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరికి ఓ కూతురు పుట్టాక ఇటీవలే విడిపోయారు. ప్రస్తుతం రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణెలో నివసిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు తన పిల్లలతోనే కాలం గడిపేస్తుంది.
కానీ ఇలా ఎంతకాలం.. ఎవరో ఒకరిని మళ్లీ పెళ్లి చేసుకోమంటూ అటు కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులు రేణూని తెగ ఇబ్బందిపెడుతున్నారట. కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే రేణు స్పష్టం చేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో వుండే రేణుకి.. తన సోషల్ మీడియా అభిమానుల నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దీంతో ఈ ప్రశ్నలన్నీంటికీ రేణు ఎంతో ఆవేదనతో ఓ క్లారిటీ ఇచ్చేసింది.
పిల్లలు వున్నా కూడా మగాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్న సమస్యేమి లేదు. కానీ మహిళల పరిస్థితి అలా కాదు. పిల్లలున్నప్పడు మహిళ మరో పెళ్లి చేసుకుంటే పెద్ద సమస్య అవుతుంది. బేసిగ్గా... తల్లిగా వుండాలంటే... ఆమె తన హ్యూమన్ ఎమోషన్స్ ను కలిగి వుండటం మానేయాలి అని రేణుదేశాయ్ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అలాగే ‘నేను ఇకపై ఎప్పటికీ మళ్లీ ప్రేమలో పడను...ఈ విషయం నన్ను ఎప్పుడు అడిగినా కూడా ప్రేమలో పడను, పడను అనే చెబుతాను' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసింది.
రేణు దేశాయ్ ట్వీట్స్ వెనుక ఓ ఆవేదన కనిపిస్తుంది. పవన్ తో విడిపోయాక తాను చాలా బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ తన పిల్లలే ఇక తన ప్రపంచం అన్నట్లుగా జీవిస్తున్న రేణును చూసి అభిమానులు జాలీపడుతున్నారు. మరి ఈ విషయంపై ఎవరెలా స్పందిస్తారో ఏమో.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more