ప్రస్తుతరోజుల్లో ఇండస్ట్రీలో వున్న నటీనటులు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారరంగంలో అడుగిడుతున్నారు. కొందరు సొంతంగా ప్రొడక్షన్ హైసెస్, మరికొందరు వ్యాపారంగంలో పెట్టుబడులు పెట్టుకోవడం, ఇంకొందరు సొంతంగా షోరూమ్స్ ఓపెన్ చేసుకోవడం.. ఇలా ఏదో ఒక రంగంలో ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటికే మహేష్ ఓ సొంత బ్యానర్ పెట్టుకోగా.. తమన్నా ఆమధ్య తన తండ్రితో కలిసి జ్యువెల్లరీ షోరూమ్ ని ఓపెన్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో కాజల్ అగర్వాల్ కూడా పయనిస్తోందని సమాచారం!
బ్యూటీ ప్రొడక్ట్స్ కి సంబంధించిన షోరూమ్స్ ని దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి కాజల్ సన్నాహాలు చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వ్యవహారాలు కాజల్ ముమ్మరం చేసిందని.. త్వరలోనే ఈ అమ్మడు అధికారికంగా వెల్లడిస్తుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా.. ఈ భామ గతకొన్నాళ్ల నుంచి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. అందులో లాభార్జన మార్గాన్ని తెలుసుకున్న ఈ అమ్మడు.. అందుకు సంబంధించి షోరూమ్స్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు.. కాజల్ కి ప్రస్తుతం తెలుగులో అంతగా ఆఫర్లు రావడం లేదు. అటు తమిళంలో మూడు సినిమాలతోపాటు హిందీలో ఓ మూవీతో బిజీగా గడుపుతోంది. అయితే.. ఈ మూవీల తర్వాత ఆమె చేతిలో మరే అవకాశాలు లేవు. గతంలోలాగే ఈమె సినీకెరీర్ అంత వేగంగా కాకుండా చాలా స్లోగా పరిగెడుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా కెరీర్ లో సెటిలైపోయే భాగంగా అమ్మడు ఇలా బిజినెస్ పెడుతోందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ కాజల్ ఈ షోరూమ్స్ ప్రారంభిస్తుందా..? లేదా..? అనేది తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more