అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ఈ చిత్రం గతకొద్ది రోజులుగా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. నరేష్ నటించిన ‘జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్లాం’ సినిమా గత నెల 26 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు. ఆ తర్వాత జులై 17న విడుదల చేయబోతున్నట్లు అల్లరి నరేష్ ప్రకటించాడు.
కానీ జులై 10న విడుదలైన ‘బాహుబలి’ అన్ని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాబట్టి కొత్త సినిమాలు, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమవుతోంది. దీంతో ఈ సమస్య వల్ల ‘జేమ్స్ బాండ్’ చిత్రాన్ని జులై 24కు వాయిదా వేసారు. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నరేష్ భార్యగా సాక్షి చౌదరి లేడీ మాఫియా డాన్ పాత్రలో నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more