Chiranjeevi To Do A Special Character In Ram Charan Latest Flick | Rakul Preet Singh | Director Srinu Vaitla

Chiranjeevi special character ram charan srinu vaitla movie rakul preet singh

chiranjeevi, chiranjeevi latest news, chiranjeevi special character, chiru 150 film, ram charan new movie, ram charan latest flick, ram charan srinu vaitla movie, rakul preet singh

Chiranjeevi Special Character Ram Charan Srinu Vaitla Movie Rakul Preet Singh : Chiranjeevi To Do A Special Character In Ram Charan Latest Flick In Srinu Vaitla Direction. In This Movie Cherry To Romance With Rakul Preet.

తనయుడి చిత్రంలో ‘మగధీరుడి’ ఝలక్

Posted: 07/25/2015 06:44 PM IST
Chiranjeevi special character ram charan srinu vaitla movie rakul preet singh

మెగాభిమానులకు ఓ శుభవార్త. తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని తిరిగి వెండితెరపై చూద్దామని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కల సాకారం కానుంది. అయితే.. ఇక్కడ మాట్లాడుకుంటోంది ఆయన 150వ చిత్రం గురించి కాదులెండి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో చిరు చేయనున్న ఓ చిన్న క్యారెక్టర్ గురించి. అవును.. చెర్రీ చేస్తున్న తాజా ప్రాజెక్టులో చిరంజీవి కూడా కొద్దిసేపటివరకు ఓ ఆసక్తికరమైన పాత్రలో కనువిందు చేయనున్నాడని సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. హైదరబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ చిత్ర టీం ఆదివారం నుంచి బ్యాంకాక్ లో ఫ్రెష్ షెడ్యూల్ ని మొదలు పెట్టనుంది. ఇందులో చెర్రీ ఓ స్టంట్ మాస్టర్ గా, ఓ ఫేమస్ తెలుగు హీరోకి డూప్ గా కనువిందు చేయనున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఓ ప్రముఖ నటుడి తీసుకోవాలని దర్శకుడు శ్రీను వైట్ల భావించాడు. ఆ మేరకు తన అన్వేషణ కొనసాగించాడు. అయితే.. ఈ సమయంలోనే ఈ స్పెషల్ పాత్రకు చిరు పేరును శ్రీనువైట్లకు చెర్రీ చెప్పినట్లు సమాచారం. చెర్రి చెప్పినట్లుగానే శ్రీనువైట్ల ఈ పాత్రలో నటించాల్సిందిగా చిరుని సంప్రదించాడట. ఈ ఐడియాపై చిరు కూడా సముఖతగానే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా బృందం చెబుతున్న వివరాల ప్రకారం.. చిరు–చరణ్ ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయట. ఇక చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కృతి కర్భంద అతని చెల్లెలిగానూ, నదియా ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి డివివి దానయ్య నిర్మాత.

ఇదిలావుండగా.. రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలోని ఓ పాటలో చిరంజీవి కొద్దిసేపు తెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన తెరపై కనిపించలేదు. అయితే.. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ సినిమాతోనే ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇవ్వడం విశేషం. చిరు 150వ చిత్రం ఇంకా ఆలస్యం అవుతున్న సందర్భంలో ఆయనతో ఈ తన చిత్రంలో కీలక రోల్ లో నటింపజేస్తే బాగుంటుందని చెర్రీ భావించాడు. పైగా.. ఈ పాత్ర సినిమాలో చాలా ప్రత్యేకం కావడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు చరణ్ చిరు నటించనున్న 150వ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేయిస్తున్నాడు. ఆ సినిమా కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram Charan Tej  Chiranjeevi  Rakul Preet Singh  Srinu Vaitla  

Other Articles