Bollywood Big B Amitabh Bachchan bowled over by grand-daughter Navya Naveli’s musical talent

Amitabh bachchan bowled by grand daughter navya naveli musical talent

amitabh bachchan, navya naveli, amitabh with navya naveli, navya naveli playing piano, amitabh piano news, navya naveli piano news, navya naveli latest news, navya naveli scandal video, amitabh bachchan news

Amitabh Bachchan bowled by grand-daughter Navya Naveli musical talent : Megastar Amitabh Bachchan was pleasantly surprised by the “hidden talent” of his granddaughter Navya Naveli, who regaled him by playing some tunes on a piano.

మనవరాలి ‘బాజా’కి ఫిదా అయిన బిగ్-బీ

Posted: 07/28/2015 01:32 PM IST
Amitabh bachchan bowled by grand daughter navya naveli musical talent

బాలీవుడ్ బిగ్-బీ అమితాబ్ బచ్చన తన అభిమానులతో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన మనవరాలిలో దాగిన ప్రతిభను చూసి తాను ఆశ్చర్యపోయానంటూ ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. అదేంటి..? ఐష్-అభిలకు పుట్టిన ఆరాధ్య అప్పుడే తన టాలెంట్ ప్రదర్శిస్తోందా? ఆ చిన్నపిల్లలో ఏం టాలెంట్ దాగి వుంది? అని ఆలోచిస్తున్నారా? అయితే.. మీరు తప్పులో కాలేసినట్టే! ఇక్కడ అమితాబ్ చెబుతోంది ఆరాధ్య గురించి కాదు.. తన తనయ శ్వేతానంద కుమార్తె అయిన నవ్యనవేలి గురించి. ఈమెలో దాగిన ఓ ప్రతిభ గురించి బిగ్-బీ అందరితో పంచుకున్నారు.

తన మనవరాలు పియానోను ఎంతో లయబద్ధంగా మీటుతూ.. వినసొంపైన సంగీతంతో ఆకట్టుకుందని బిగ్-బీ తన బ్లాగులో పేర్కొన్నారు. ‘నవ్య తనలో దాగివున్న కళను ప్రదర్శించి నన్ను ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆమెకు సంగీతంలో ఎలాంటి శిక్షణ ఇప్పించకపోయినప్పటికీ... పియానోని మాత్రం అద్భుతంగా వాయించింది. తనలో ఇంత ప్రతిభ దాగివుందని తెలిశాక.. నాకు ఆశ్చర్యం కలగడంతోపాటు ఆనందంగా కూడా వుంది’ అని అన్నారు. అంతేకాదండోయ్.. నవ్య పియానో వాయిస్తుండగా.. తాను లీనమై వింటున్న ఫోటోలను కూడా బిగ్-బీ తన బ్లాగులో పోస్ట్ చేసి, అభిమానులతో తాను అనుభవించిన, పొందిన ఆనందాల అద్భుతమైన ఘడియల గురించి విశ్లేషించారు.

navya-naveli-piano-photos

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  navya naveli  piano playing  

Other Articles