Aditya Music bags Kanche audio rights

Varun tej s kanche audio release on sept 12

Aditya Music bags Kanche audio rights, Varun Tej Kanche, Krish Kanche, Varun Tej ,Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

Leading music company,Aditya Music, has bagged the audio rights of Mega hero Varun Tej’s upcoming film Kanche. Varun Tej is eagerly awaiting the release of his upcoming film Kanche which will be directed by filmmaker Krish.

కంచె అడియో హక్కులను దక్కిందుకున్న అదిత్య మ్యూజిక్

Posted: 08/30/2015 08:02 PM IST
Varun tej s kanche audio release on sept 12

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమైన హీరో వరుణ్ తేజ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో ‘కంచె’ పేరుతో రమారమి షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులను అదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. చిరందన్ భట్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తుండటం.. టీజర్ తో అంచనాలు ఏకంగా ఉవ్వెత్తున పెరగడంతో అందరికంటే ముందుగా అదిత్య మ్యూజిక్ అడియో హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఆడియోను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక ఆగష్టు 15వరకూ ఒక మోస్తారు అంచనాలతో కనిపించిన ఈ సినిమా, టీజర్ రిలీజ్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క చిన్న టీజర్‌తో అందరీ దృష్టినీ ఆకర్షించడమే కాక, ముందే సినిమాపై ఒక అవగాహన కలిపించడంలో ‘కంచె’ సూపర్ సక్సెస్ అయింది. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.  ఇక ఇదే ఉత్సాహంతో దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 1న ట్రైలర్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేశారు. హైద్రాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో డాల్బీ అట్మాస్ సిస్టమ్‌ ద్వారా కంచె ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక అదేరోజు ఆన్‌లైన్లో కూడా ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aditya Music  Varun Tej  Krish  

Other Articles