Powerstar Pawan Kalyan | Birthday special

Powerstar pawan kalyan birthday special 2015

Happy Birthday Powerstar Pawan Kalyan, Powerstar Pawan Kalyan birthday 2015, Powerstar Pawan Kalyan stills, Powerstar Pawan Kalyan special articles, Powerstar Pawan Kalyan special video, Powerstar Pawan Kalyan special greetings, Powerstar Pawan Kalyan songs, Powerstar Pawan Kalyan latest news, Powerstar Pawan Kalyan latest posters, Powerstar Pawan Kalyan

Powerstar Pawan Kalyan Birthday Special 2015: Wishing a very happy birthday to tollywood Powerstar Pawan Kalyan. Powerstar Pawan Kalyan birthday celebretions.

నిజ జీవితంలో ఆరడుగుల బుల్లెట్.. పవర్ స్టార్

Posted: 09/01/2015 05:14 PM IST
Powerstar pawan kalyan birthday special 2015

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ఈ ఒక్క పేరు టాలీవుడ్ లో గతకొద్ది కాలంగా పలు సంచనాలు క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఎనర్జీ. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ వుంది. కేవలం నటుడిగానే కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా తన జీవితం కొనసాగిస్తూ అందరి గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. నీతి, నిజాయితీ, ధైర్యం, పట్టుదల, కృషి, మానవత్వం, సేవాభావం వంటి పలు మంచి వ్యక్తిత్వం కలిగిన ఈయన... తెలుగు వారి గుండెల్లో పవర్ స్టార్ గా నిలిచాడు. అలాంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు.

కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు సెప్టెంబర్ 2, 1971లో పవన్ కళ్యాణ్ జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబులకు తమ్ముడు పవన్ కళ్యాణ్. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ సాధించలేదు కానీ, ఆ తర్వాత వచ్చిన ‘సుస్వాగతం’ సినిమా హిట్టయ్యి పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ మాత్రం పవన్ క్రేజ్ ను భారీగా పెంచేసింది.

Video Courtesy : Volga Video

1998లో వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమాతో పవన్ కళ్యాణ్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘బద్రి’, ‘తమ్ముడు’, ‘ఖుషీ’ చిత్రాలు పవన్ కళ్యాణ్ ను ‘పవర్ స్టార్’ గా మార్చేసాయి. ఈ సినిమాలతో పవన్ కెరీర్ భారీగా పెరిగిపోయింది. పవర్ స్టార్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఏర్పడిపోయారు.

కేవలం నటుడిగానే కాకుండా ‘జానీ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ‘ఖుషీ’ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు ఐదారు చిత్రాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే వుంది తప్ప కొంచెం కూడా తగ్గలేదు.

Video Courtesy : Telugu Filmnagar

ఆ తర్వాత వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డుల మోత మోగించేసింది. ఈ సినిమాతో పవర్ స్టార్ క్రేజ్ తారాస్థాయిని దాటిపోయింది. అంతులేని కొన్ని కోట్లమంది అభిమానులను పవన్ కళ్యాణ్ కేవలం తన వ్యక్తిత్వంతో దక్కించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు(అత్తారింటికి దారేది, గోపాల గోపాల) కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాయి. సినిమాల గురించి పక్కన పెడితే... పవర్ స్టార్ ఒక ఆరడుగుల బుల్లెట్ లాంటి వ్యక్తి.

సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఒక సామాజిక బాధ్యత కలిగిన మాములు వ్యక్తిగా కూడా ప్రజలకు సేవా చేస్తున్నాడు. సాధాసీదా వ్యక్తిగా తన ఫాం హౌస్ లో పంటలు పండిస్తుంటాడు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని వాళ్లకు సహయం చేయడానికి ‘జనసేన’ అనే పార్టీని స్థాపించి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరిన్ని మంచి చిత్రాలను తీస్తూ, ఇలాగే ప్రజలకు సేవా చేస్తూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్.

Video Courtesy : MAA TV

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Powerstar Pawan Kalyan  Birthday special  stills  news  gallery  

Other Articles