బాలీవుడ్ సెక్సీ భామ సన్నీలియోన్ నటించిన కండోమ్ ప్రకటనపై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సన్నీలియోన్ నటించిన ఈ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింతగా పెరగడం ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్ జాన్ ఈ విషయంపై తన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో సన్నీలియోన్ కు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బాసటగా నిలిచారు. ఈ విషయంపై శిల్పాశెట్టి స్పందిస్తూ... సన్నీలియోన్ ప్రకటనపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. ప్రజలెవరూ కూడా ఆ ధోరణీలో ఆలోచిస్తారని నేను భావించడం లేదు. దీని గురించి ఎక్కువగా స్పందించడం సరికాదు. సానుకూల అంశాలపై మాత్రమే దృష్టిపెడితే బాగుంటుందని చెప్పుకొచ్చింది.
అలాగే సన్నీలియోన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ... రాజకీయ నాయకులు తనకోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, ఆ సమయాన్ని కష్టాల్లో వున్న ప్రజలకు సాయం చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుందని సన్నీలియోన్ ఘాటుగా స్పందించింది. మరి ఈ కండోమ్ ప్రకటన వ్యవహారం ఇంకెంత దూరం వెళ్లనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more