The Tollywood Director Maruthi Wants To Do Movies With Pawan Kalyan And Mahesh Babu | Tollywood Gossips

Director maruthi wants to do movies with pawan kalyan and mahesh babu

director maruthi, pawan kalyan, mahesh babu, bhale bhale magadivoy, tollywood updates, telugu news, maruthi latest interview, maruthi photos, maruthi movies, tollywood gossips, pawan kalyan movies, mahesh babu movies

Director Maruthi Wants To Do Movies With Pawan Kalyan And Mahesh Babu : Tollywood Small Movies Director Maruthi Wants To Do Movies With Pawan Kalyan And Mahesh Babu.

పవన్, మహేష్ లపై ఆశలు పెట్టుకున్న మతిమరుపు డైరెక్టర్

Posted: 09/19/2015 10:32 AM IST
Director maruthi wants to do movies with pawan kalyan and mahesh babu

పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల ఇమేజ్ తెలుగు ఇండస్ట్రీలో ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తారో.. అలాగే వారితో సినిమాలు తీయాలని దర్శకులు పడిగాపులు కాస్తుంటారు. ఆ ఇద్దరితో కనీసం ఒక్క సినిమా అయినా తీస్తే తమ కెరీర్ మలుపు తిరుగుతుందన్న ఆశలు భారీ స్థాయిలో పెట్టుకుంటారు. అలాంటివారి జాబితాలోకి తాజాగా మతిమరుపు డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? మరెవ్వరో కాదు.. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి. చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మారుతి.. పవన్, మహేష్ లతో సినిమాలు చేయాలనేది తన కోరికగా వెల్లడించాడు.

‘ఈరోజుల్లో’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మారుతి.. ద్వందార్థాలతో కూడిన డైలాగులతో సినిమాలు చేస్తూ ‘బూతు’ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్ అతనికి యూత్ ఆడియెన్స్ కి తెచ్చిపెట్టింది కానీ.. ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రం దరిచేరనివ్వలేదు. దీంతో ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆ మధ్య ‘ప్రేమజంట’ సినిమాని తెరకెక్కించాడు. కానీ.. అది ఫెయిల్ కావడంతో అతనికి నిరాశే దక్కింది. ఎలాగైనా ‘బూతు’, ‘ఫెయిల్యూర్’ మార్క్ లను తొలగించుకోవాలని ఫిక్స్ అయిన మారుతి.. కొన్నాళ్లపాటు మంచి స్టోరీ కోసం వెయిట్ చేశాడు. అనంతరం ఫ్యామిలీ హీరోలుగా పేరున్న వారిని సంప్రదించాడు. చివరికి నాని ఇతనితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసేందుకు ఒప్పుకోగా.. ఆ చిత్రం మంచి విజయం సాధించి, మారుతికి ఆ రెండు ఇమేజ్ ల నుంచి బయట పారేసింది. దీంతో.. ఇప్పుడు మారుతి స్టార్ హీరోలపై దృష్టి సారించాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించాడు కూడా!

‘ఎప్పటి నుంచో నాకు స్టార్ హీరోలతో చేయాలని వుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు చేయాలనేది కోరిక. వారి ఇమేజ్ కి తగిన కథలు కూడా రెడీగా వున్నాయి. వారితో పనిచేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను’ అని మారుతి పేర్కొన్నాడు. మరి.. ఆ హీరోలు ఇతనికి అవకాశం ఇస్తారా? స్టార్ డైరెక్టర్ల జాబితాల్లోకి చేరుస్తారా? వెయిట్ అండ్ సీ.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Maruthi  Pawan Kalyan  Mahesh Babu  

Other Articles