ప్రముఖ సినీనటి మనోరమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని మైలాపూర్ స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. మనోరమను చివరి చూసేందుకు అభిమాను లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ భాషల్లో మనోరమ వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. మరో వెయ్యి నాటకాల్లో నటించారు. మనోరమను 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం సయితం ‘కళైమామణి’ అవార్డును అందించింది. ఆమె 300 లకుపైగా పాటలు కూడా పాడారు. అన్నిటికంటే ముఖ్యంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆమె నటించారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్‌తోపాటు జయలలితో కలిసి ఆమె పనిచేశారు. మనోరమ మరణవార్త విని పలువురు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ప్రముఖ నటి మనోరమ(78) మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. గొప్ప నటితో పనిచేసిన అదృష్టవంతుల్లో నేను ఒకదాన్ని. గొప్ప మనవతావాది. మిమ్మల్ని మరచిపోలేకపోతున్నామని శ్రీదేవీ ట్విట్ చేశారు. భారత చిత్ర పరిశ్రమలో గొప్ప హాస్యనటిని కోల్పోయాం. మీకు మా గౌరవ వందనాలు, కృతజ్ఞతలని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆచీ మరణం చిత్రసీమకు తీరని నష్టం. ఆ గొప్ప వ్యక్తి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని నటి రాధికాశరత్‌కుమార్ పేర్కోన్నారు. ఏ ఇతర కళాకారులు మీకు సాటికారు. మధురమైన జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లారు. తెరపై మీరు ఉన్నంతసేపు వెలుగును నింపేవారని తమిళ హీరో సూర్య ట్విట్ చేయగా, భారత చిత్రపరిశ్రమ మ్యాజిక్ మనోరమగారు. మీరు ఎప్పటికి జీవించే ఉంటారు.అంటూ మంచు మనోజ్ ట్విట్ చేశారు.
ప్రముఖ తమిళ నటి.. తన విలక్షణ వాచికంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్.. మనోరమ (78) ఇక లేరు! కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం రాత్రి కన్నుమూశారు. ‘ఆచి’ అని తమిళులందరూ ప్రేమగా పిలుచుకునే మనోరమ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో 1500కు పైగా సినిమాల్లో నటించి.. అత్యధిక చిత్రాల్లో నటించిన నటీమణిగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 1000కి పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చి సత్తా చాటారు.
తమిళనాడులోని తిరువారూరు జిల్లా మన్నారుగుడిలో 1937 మే 26న ఓ పేద కుటుంబంలో మనోరమ జన్మించారు. ఆమె అసలు పేరు గోపీ శాంత. పది నెలల వయసున్న మనోరమను భుజాన వేసుకుని, పొట్ట చేతపట్టుకుని ఆమె తల్లి రామామృతం.. కరైకుడికి సమీపంలోని పళ్లత్తూరుకు చేరుకున్నారు. ఒంటరి తల్లి వద్ద పెరిగిన మనోరమ చిన్నవయసులోనే నాటకాలవైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ల వయసులోనే పలు నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని.. క్రమేపీ సినిమాల్లో అడుగుపెట్టి తనదైన శైలితో చరిత్ర సృష్టించారు.
నాటకాల్లో వేసేటప్పుడు.. తిరువేంగడం అనే నాటక దర్శకుడు, త్యాగరాజన్ అనే హార్మోనిస్ట్ ఆమె పేరును గోపీ శాంత నుంచి మనోరమగా మార్చారు. కాలక్రమంలో.. ‘మలయ్ ఇట్ట మంగాయ్’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె హాస్యనటిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు. హాస్యనటిగా ఆమె నటజీవితంలో మైలురాయిలాంటి పాత్ర.. తిల్లానా మోహనాంబాళ్ చిత్రంలో ఆమె చేసిన జిల్ జిల్ రమామణి క్యారెక్టర్. అనంతర కాలంలో కోవై సరళ వంటి వారు హాస్యనటులుగా పేరొందుతున్న సమయంలో రూటు మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు.
నాటకాల్లోగానీ, సినిమాల్లోగానీ.. మొత్తమ్మీద తన కెరీర్లో ఐదుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఘనత ఆమెది. ఆ ఐదుగురూ.. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్. 2002లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో గౌరవించింది. 1989లో.. మనోరమ జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని పొందారు. ఇక.. మనోరమ భర్త రామనాథన్ కూడా నటుడే. వారికి భూపతి అనే కుమారుడున్నాడు. వైవాహిక జీవితం విఫలం కావడంతో ఆమె తన కొడుకు భూపతిని తీసుకుని బయటకు వచ్చేశారు. పుట్టిందీ పెరిగిందీ తమిళనాడులోనే అయినా.. తన విలక్షణ వాచికంతో తెలుగు చిత్రాల్లోనూ నటించి తెలుగువారికీ దగ్గరయ్యారామె. శుభోదయం, అల్లరి ప్రేమికుడు, రిక్షావోడు, బావ నచ్చాడు, అరుంధతి తదితర సినిమాల్లో ఆమె నటనను తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more