సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘కొలంబస్’. ‘డిస్కవరింగ్ లవ్’ అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో నటించాడు. ఇష్క్ సినిమా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.సామలను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వరలో పాటలను, వచ్చే నెల 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి“ అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర
Video Courtesy : Movie Mitra
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more