అక్కినేని అభిమానులు ‘అఖిల్’ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 22న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా వేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత హీరో నితిన్ ప్రకటించడంతో అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయకుండా వినాయక్, నితిన్ లు అడ్డుకుంటున్నారంటూ నెల్లూరు పట్టణంలో అక్కినేని అభిమానులు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనలు చేపట్టారు. ‘నమ్మకద్రోహుడు-నితిన్’, ‘కుట్రదారుడు-వి.వి.వినాయక్’ అంటూ ఆందోళన చేపట్టారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శకనిర్మాతలు వెంటనే అక్కినేని నాగార్జునకు తెలియజేయడంతో... నాగార్జున ప్రస్తుతం తాను వున్న ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమా షూటింగ్ లొకేషన్లోనే ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి, ఈ విషయంపై సరైన క్లారిటీ ఇచ్చారు. అలాగే ‘అఖిల్’ సినిమా వాయిదాకు అక్కినేని అభిమానులు క్షమించాలని దర్శకులు వినాయక్ కోరారు.
నాగార్జున మాట్లాడుతూ... సినిమా మొత్తం పూర్తయ్యింది. చాలా బాగా వచ్చింది. అయితే గ్రాఫిక్స్ విషయంలో కాస్త మరింత బెటర్ మెంట్ కోసం విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. సినిమాలో ఆ సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేసేది. దర్శకుడు వినాయక్ అనుకున్న స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ వారు 75శాతం సూపర్బ్ గా చేసారు. మిగతా 25శాతం కూడా చేసినప్పటికీ... ఇంకా బెటర్ మెంట్ కోసం మరికొంత సమయం కావాలని అడిగారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వారికి సమయం ఇవ్వడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు.
అలాగే... సినిమా విడుదలయిన తర్వాత ఈ వాయిదా విషయాన్ని అభిమానులు మర్చిపోతారు. సినిమా చాలా ఫెంటాస్టిక్ గా వచ్చింది. చాలా నమ్మకంతో చెబుతున్నాను. అఖిల్ డాన్సులు అదరగొట్టేసాడు. అఖిల్ డాన్సులు చూసి నేనే షాక్ అయ్యాను. అంతా బ్రహ్మాండంగా చేసాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అఫిషీయల్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more