నాగచైతన్య పేరు చెప్పగానే ముందు ` ఏమాయ చేసావె` సినిమా గుర్తుకొస్తుంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమా అది. తమిళంలో శింబు నటించారు. ఇప్పుడు తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు హీరోలుగా మరలా గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో `అచ్చం ఎన్బదు మడమయడా` అనే పేరును ఖరారు చేశారు. తెలుగులో `సాహసం శ్వాసగా సాగిపో` అని టైటిల్ పెట్టారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. `ఏమాయచేసావె` తర్వాత నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ మీనన్, ఎ.ఆర్.రెహమాన్ కలిసి పని చేస్తున్న సినిమా ఇది. తెలుగులో ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంజిమ మోహన్ కథా నాయికగా నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఎ గురు ఫిలిమ్స్ రూపొందిస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ ``నాగచైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కాంబినేషన్ తెలుగులో `ఏ మాయ చేసావె` పేరుతో ఎంత గొప్ప మాయ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్లో మా `సాహసం శ్వాసగా సాగిపో` రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగుతుంది. యాక్షన్ కూడా మేళవించి గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తప్పకుండా రీచ్ అవుతుంది. మలయాళ నటి మంజిమ మోహన్‌ను ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగులో పరిచయం చేస్తున్నాం. అక్టోబర్ 11 నుంచి ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఎ.ఆర్.రెహమాన్ వినసొంపైన బాణీలను ఇచ్చారు. వచ్చే నెల్లో పాటల్ని, డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more