Ravi Teja | Bengal Tiger | Trailer | Audio Release

Ravi teja bengal tiger movie audio release

Ravi Teja Bengal Tiger Audio Release, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Movie Audio Release: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 5 November.

బెంగాల్ టైగర్ ఆడియో విడుదల... ట్రైలర్ సిరిగిపోయింది!

Posted: 10/19/2015 11:22 AM IST
Ravi teja bengal tiger movie audio release

మాస్ మహారాజ రవితేజ హీరోగా రాశిఖన్నా, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. బిగ్ సీడిని నటులు బోమన్ ఇరాని ఆవిష్కరించారు. ఆడియో సీడిలను కె.కె.రాధామోహన్ విడుదల చేసారు. థియేటర్ ట్రైలర్ ను తమన్నా విడుదల చేసారు.

ఈ సంధర్భంగా రవితేజ మాట్లాడుతూ... సంగీత దర్శకుడు భీమ్స్ లో మంచి ట్యాలెంట్ వుంది. తనకు మంచి ఫ్యూచర్ వుంటుంది. తనతో కలిసి చాలా సినిమాలకు పనిచేయాలని వుంది. ఈ సినిమా పెద్ద హిట్టయ్యి నిర్మాత రాధామోహన్ కు లాభాలు తీసుకురావాలి. తమన్నా, రాశిఖన్నాలతో మళ్లీ పనిచేయాలనుకుంటున్నాను. సంపత్ ఈ సినిమాతో హ్యట్రిక్ హిట్ కొడతాడు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అని అన్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్లు, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సినిమాపై అంచనాలు పెంచేసాయి. కమర్షియల్ లవ్, రొమాంటిక్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Trailer  Audio Release  Rashi khanna  Tamanna  

Other Articles