cricket rans demanding mumbai cricket association to ban anushka from stadium | virat kohli controversy | kohli news

Cricket rans demand mumbai cricket association to ban anushka

anushka sharma, virat kohli, virat kohli controversies, anushka sharma controversies, anushka hot photo shoot, mumbai cricket association

cricket rans demand mumbai cricket association to ban anushka : cricket rans demanding mumbai cricket association to ban anushka from stadiums.

‘అనుష్కను అక్కడ బ్యాన్ చేయండి’

Posted: 10/26/2015 12:57 PM IST
Cricket rans demand mumbai cricket association to ban anushka

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ఏ ముహూర్తాన క్రికెటర్ కోహ్లీ ప్రేమలో పడిందో తెలీదు కానీ.. అప్పటి నుంచి ఈమెకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతోపాటు అభిమానుల నుంచి నిత్యం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కోహ్లీ విషయంలో ఏదో ఒక విధంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమధ్య కోహ్లీ సరిగ్గా ఆడలేదని, క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోహ్లీ సరిగ్గా ఆడకపోవడానికి కారణం అనుష్కనేనంటూ ఘాటుగా మండిపడ్డారు. కొంతకాలం తర్వాత ఆ వ్యవహారం చల్లబడటంతో పరిస్థితులు సద్దుమణిగాయని అంతా అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. మళ్లీ అనుష్కకు కోహ్లీ తిప్పలు వచ్చిపడ్డాయి. ఈసారి ఏకంగా ఆమెను బ్యాన్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ సిరీస్ను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే! ఈ సిరీస్ సందర్భంగా జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ కొంత ఫేలవమైన ప్రదర్శించాడు. రెండు మ్యాచులు మినహా.. మిగతా మూడు వన్డేల్లోనూ కోహ్లీ దారుణంగా ఆడాడు. ముఖ్యంగా ఎంతో కీలకమైన ఐదో వన్డేలో కోహ్లీ తక్కువ స్కోరుకే బౌల్డ్ కావడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోహ్లీ వైఫల్యానికి అనుష్కశర్మనే కారణం అంటూ మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. కోహ్లీ ఆమె చుట్టూ తిరుగుతుండటంవల్లే తన ఆటతీరుపై దృష్టి సారిచడం లేదని, ఫేలవమైన ప్రదర్శన చేస్తున్నాడని, అందుకు అనుష్కనే కారణమని ఆరోపించారు. ఆమె నుంచి కోహ్లీ దూరమైతేగానీ తిరిగి పుంజుకోడని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ షారుక్ ఖాన్ పై నిషేధం విధించే బదులు అనుష్కను బ్యాన్ చేస్తే సరిపోతుందని.. అప్పుడు కోహ్లీ కోలుకొని తన ఆటతీరును మార్చుకోగలడని అంటున్నారు. తక్షణమే ఆమెను బ్యాన్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విధంగా అనుష్కపై విమర్శలు వస్తున్న క్రమంలో ఈసారి చాలా ఎక్కువమందే ఆమెకు మద్దతుగా నిలిచారు. కోహ్లీ విఫలమైన ప్రతిసారి అనుష్కనే విమర్శిస్తారే తప్ప.. అనుష్క సినిమా ప్లాప్ అయినప్పుడు కోహ్లీని ఎందుకు విమర్శించరని ప్రశ్నిస్తున్నారు. ‘బాంబే వాల్వేట్’ ఫ్లాప్ అయితే కోహ్లీని ఒక్కరైనా తిట్టారా అని నిలదీస్తున్నారు. ఒక్క కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ను మాత్రమే ఎందుకు తిడుతున్నారని, మిగితా క్రికెటర్ల గర్ల ఫ్రెండ్స్పై కూడా ఇలాగే విమర్శలు చేస్తున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలా ప్రతిదానికి అనుష్క శర్మను విమర్శించడం సరికాదని హితవు పలికారు. మరి.. తన గర్ల్ ఫ్రెండ్ పై వస్తున్న ఆరోపణలకు కోహ్లీ ఏ విధంగా సమాధానం ఇస్తాడో వేచి చూడాల్సిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  mumbai cricket association  

Other Articles