prabhas talks about his bollywood offers in latest interview | prabhas got dhoom 4 villain role | prabhas bollywood offers

Prabhas interview on bollywood movie offers dhoom4 villain character

prabhas interview, prabhas news, prabhas bollywood offers, prabhas updates, prabhas controversies, bahubali movie news, bahubali updates, bahubali 2 news, prabhas dhoom 4 news, prabhas dhoom 4 villain

prabhas interview on bollywood movie offers dhoom4 villain character : prabhas talks about his bollywood offers in latest interview. according to the sources he got villain role in dhoom 4 movie.

‘బాహుబలి’కి బంపరాఫర్.. ‘ధూమ్-4’లో అవకాశం!

Posted: 10/26/2015 06:11 PM IST
Prabhas interview on bollywood movie offers dhoom4 villain character

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా రూపొందించిన ‘బాహుబలి’ సినిమా హీరో ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాంతో ఈ ఆరడుగుల ఆజానుభావుడికి వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. ఈ సినిమా కారణంగానే ‘మహీంద్రా’ వెహికల్స్ కి మొదటిసారిగా ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు కూడా.

అంతేకాదు.. హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అందులో ఎంతమాత్రం వాస్తవం వుందో లేదో తెలీదు కానీ.. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి మాత్రం వరుసగా బంపరాఫర్లు వస్తున్నాయనే వార్తలు మాత్రం నిజమే. తమ సినిమా కచ్చితంగా చేయాల్సిందేనంటూ కొందరు దర్శకనిర్మాతలు ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం సిద్ధపడుతున్నారు. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చిపడడంతో అతనితో సినిమాలు తీస్తే కచ్చితంగా కలెక్షన్ల వర్షం కురుస్తుందన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు ప్రభాస్ వెంట పడుతున్నారని తెలిసింది. బాలీవుడ్ నుంచి చాలామంది నిర్మాతలు ఇతనిని సంప్రదించినట్లు సమాచారం.

ముఖ్యంగా.. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రభాస్ ని ‘ధూమ్ 4’లో విలన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ‘బాహుబలి’ హిందీ రైట్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! అక్కడ ఈ చిత్రం 100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసి ఆ సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ప్రభాస్ కి అక్కడ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది కాబట్టి.. ‘ధూమ్-4’లో అతనిని విలన్ గా తీసుకుంటే మరిన్ని కలెక్షన్లు వస్తాయనే నమ్మకంతో ఆ సంస్థ ప్రభాస్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి.. ఈ అవకాశాన్ని ప్రభాస్ ఓకే చేశాడో లేదో తెలీదు కానీ.. బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్న మాట నిజమేనని స్పష్టం చేశాడు.

తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రబాస్ మాట్లాడుతూ.. ‘బాహుబలి తర్వాత నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నేను ‘బాహుబలి 2’ని ఫినిష్ చేసి దాని నుంచి బయటకి వచ్చేంతవరకూ మరో సినిమాకి సైన్ చేయలేను. అందుకే.. సుజీత్ సినిమాని కూడా హోల్డ్ లో పెట్టాను. అలాగే ఒక సినిమా హిట్ తోనే నేను నేషనల్ స్టార్ అయిపోయానంటే.. అది నేను నమ్మను’ అని ప్రభాస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ‘బాహుబలి-2’ కోసం కసరత్తు చేస్తున్నాననీ, ఆ సినిమా తర్వాతే ఇతర సినిమాలపై దృష్టి పెడతానని స్పష్టం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas dhoom 4 villain  bahubali 2 updates  

Other Articles