'రన్ రాజా రన్' చిత్రం తరువాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి వినూత్నమైన కాన్సెప్ట్ తో మెదటి చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసిన యంగ్ టాలెంటెడ్ డైరక్టర్ మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నారు. సురభి హీరోయిన్. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యెక్క ఫస్ట్ లుక్ ని యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. విడుదల చేసిన మెదటి పోస్టర్స్ కి అనూహ్యంగా స్పందన రావటంతో యూనిట్ సభ్యులు ఆనందంగా వున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'రన్ రాజా రన్' చిత్రం తరువాత మా బ్యానర్ యు.వి.క్రియోషన్స్ లో శర్వానంద్ హీరోగా చిత్రం చేస్తున్నాం. దానికి ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ ని ఖరారు చేశాము. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రం తో దర్శకుడిగా సూపర్‌సక్సెస్ ని సాధించిన దర్శకుడు మేర్లపాక గాంధి దర్శకత్వం చేస్తున్నారు. గాంధి చెప్పిన కథ, కథనం విన్న వెంటనే నచ్చాయి. మాబ్యానర్ నుండి చిత్రం వస్తుందంటే ప్రేక్షకులకి ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. వారి అంచనాలు అందుకునేలా దర్శకుడు గాంధి సూపర్ స్టోరి ని నేరేట్ చేశాడు. చెప్పిన విధంగానే తెరకెక్కించాడు. రన్ రాజా రన్ చిత్రంలో శర్వానంద్ ని కొత్తగా ఎలా చూపించామో.. ఈ చిత్రం లో కూడా దర్శకుడు గాంధి శర్వానంద్ ని న్యూలుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. పాత్ర కూడా చాలా స్టైలిష్ గా వుంటుంది. హీరోయిన్ సురభి కూడా చాలా అందంగా వుంటుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ నటి ఊర్వశిగారు, ప్రభాస్ శీను, సప్తగిరి, షకలక శంకర్ లు నటించారు, సినిమాటోగ్రఫి కార్తిక్ ఘట్టమనేని అందరిని చాలా అందంగా చూపించాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించారు. ఈచిత్రానికి సంభందించి షూటింగ్ దాదాపు పూర్తయింది. రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌ప్రెస్ రాజా మెదటి లుక్ ని విడుదల చేశాము. శర్వానంద్, సురభిల లుక్ చాలా ఫ్రెష్ గా వున్నాయని అందరూ చెబుతున్నారు. సినిమా కూడా చాలా ఫ్రెష్ గా వుంటుంది. త్వరలోనే ఆడియో ని విడుదల చేస్తాము.
నటీనటులు.. శర్వానంద్,సురభి, హరీష్ ఉత్తమన్, ఉర్వశి, ప్రభాస్ శీను, సుప్రీత్, సప్తగిరి, షకలక శంకర్, దువ్వాసి, బండ రఘు, నాగినీడు, సుర్య తదితరులు నటించారు..
సాంకేతికనిపుణులు.. కెమెరా-కార్తిక్ ఘట్టమనేని, సంగీతం-ప్రవీణ్ లక్కరాజు, ఆర్ట్- రవీందర్, ఎడిటర్- సత్య.జి, డాన్స్- రాజుసుందరం, రఘు, స్టంట్స్-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్-తోట భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- ఎన్.సందీప్, నిర్మాతలు- వంశి, ప్రమెద్, దర్శకత్వం- మేర్లపాక గాంధి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more