allu arjun has posted his son allu ayaan's little doctor photographs on twitter for halloween day special | holloween day special treat

Allu arjun son allu ayaan turns little doctor for halloween day

allu ayaan little doctor, allu ayaan photos, allu ayaan news, allu ayaan updates, allu arjun son, allu arun with wife, allu arjun with sneha reddy

allu arjun son allu ayaan turns little doctor for halloween day : allu arjun has posted his son allu ayaan's little doctor photographs on twitter for halloween day special.

బుల్లి డాక్టర్ వేషంలో మురిపించిన ‘అల్లు అయాన్’

Posted: 10/31/2015 06:18 PM IST
Allu arjun son allu ayaan turns little doctor for halloween day

టాలీవడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు బుల్లి డాక్టర్ వేషంలో కనువిందు చేశారు. డాక్టర్లు వేసుకునే దుస్తులు ధరించి, చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఫోటోను అల్లు అర్జున్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఉన్నట్లుండి అల్లు అయాన్ ఇప్పుడు ‘బుల్లి డాక్టర్’ వేషం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడా? లేక ఇంకేమైనా కారణం వుందా? అనే సందేహాలు రాక మానదు. అయితే.. అయాన్ ఈ వేషం వేసింది సినిమాల కోసం కాదులెండి.. ఓ ఈవెంట్ నేపథ్యంలో అల్లుఅర్జున్ తన కొడుకును అలా డాక్టర్ గా తయారు చేసి.. తన అభిమానులతో ఫోటోను పంచుకున్నాడు.

‘హాలోవెన్ డే’ ఫెస్టివల్ గురించి ప్రతిఒక్కరికీ తెలిసే వుంటుంది. విదేశాల్లో జరుపుకునే ఈ ఈవెంట్ ని ఇండియాలోనూ కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో సరదా కోసం చేసుకుంటారు. ఈ ఈవెంట్ లో అందరూ గుర్తుపట్టనంతగా రకరకాల వేషాలు వేసుకుని పార్టీ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగానే అల్లు అర్జున్ తన కొడుకును డాక్టర్ వేషంలో తయారుచేశాడు. అక్టోబర్ 30 నుంచి 31 వరకు ఆ హాలోవెన్ ఫెస్టివల్ జరుపుకుంటున్న సందర్భంగా తన తనయుడి డాక్టర్ వేషం ఫోటోను అల్లు అర్జున్ ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ‘హాలోవెన్ డే శుభాకాంక్షలు.. నా చిట్టి కుమారుడితో ఇలా గడపడం చాలా సరదాగా వుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోను వీక్షించిన అభిమానులు.. ‘బుల్లి డాక్టర్’గా అల్లు అయాన్ చాలా క్యూట్ గా, సూపర్ గా వున్నాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : allu ayaan little doctor  allu arjun twitter  allu arjun with wife  

Other Articles