టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్ లర్స్ హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలినట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాలు తన విలువైన సమయాన్ని కేటాయించి, సినిమా విజయానికి ముఖ్య కారకుడిగా నిలిచాడు. ‘మిర్చి’, ‘బాహుబలి-ది బిగినింగ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా వుండనుందని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలు కేవలం పుకార్లేనని అర్థమవుతోంది.
ఎందుకంటే ప్రభాస్ 2016 చివరకు ఫుల్ బిజీ కానున్నాడు. ‘బాహుబలి- ది కన్ క్లూజన్’ (‘బాహుబలి2’) కోసం దాదాపు 10 నెలల సమయాన్ని ఇచ్చేసాడు. అంటే 2016 నవంబర్ వరకు ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ లోనే బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయినప్పటికీ మిగతా 60% పూర్తవ్వాలంటే ఆ మాత్రం సమయం కూడా తక్కువేనని అర్థమవుతోంది. కానీ ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని, పర్ఫెక్ట్ టైమింగ్ లో షూటింగ్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.
అందువల్ల ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 10 నెలల సమయం కేటాయించనున్నాడు. కానీ ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మాత్రం వచ్చే ఏడాది మొదట్లోనే ప్రభాస్ పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. కానీ సినిమా కోసం మళ్లీ ఈ పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ‘బాహుబలి2’ కోసం ప్రభాస్ తన పెళ్లిని కూడా వాయిదా వేస్తున్నట్లుగా అర్థమవుతోంది.
ఈ వార్తతో ప్రభాస్ అభిమానులంతా నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కు లేడి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. లేడీ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ పెళ్లి చూడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈసారైనా ప్రభాస్ పెళ్లి ఖాయమవుతుందని అనుకున్నారు కానీ ఈ వార్త తెలిసి ఉసూరుమంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more