goa beauty ileana to do item song in balakrishna dictator movie

Goa beauty ileana to do item song in balakrishna dictator movie

ileana news, goa beauty ileana, balakrishna news, dictator movie updates, actress anjali news, sonal chouhan hot photos, aksha pardasani news

goa beauty ileana to do item song in balakrishna dictator movie : Goa beauty ileana has given green signal to do item song in dictator movie with balakrishna.

డిక్టేటర్‌లో ఐటెంబాంబ్‌గా గోవా బ్యూటీ

Posted: 11/11/2015 03:46 PM IST
Goa beauty ileana to do item song in balakrishna dictator movie

ఒకప్పుడు టాలీవుడ్‌లో తన జీరో సైజ్ బాడీతో ఓ ఊపు ఊపేసిన గోవాబ్యూటీ.. బాలీవుడ్ అక్కున చేర్చుకోవడంతో తెలుగు ఇండస్ట్రీని తిట్టరాని తిట్లు తిట్టేసి వెళ్లిపోయింది. అక్కడు పలు సినిమాల్లో అవకాశాలు రావడం వల్ల ఈమెకి ఈగో ఆకాశ సరిహద్దులు దాటేసింది. అయితే.. ఇప్పుడు అక్కడ ఆఫర్లు కరువవడంతో తిరిగి తెలుగు సినిమాలపై దృష్టి సారించింది. హీరోయిన్‌గా కాకపోయినా.. సినిమాలో హైలైట్ అయ్యే ఏ పాత్రలో నటించడానికైనా రెడీగా వున్నానంటూ సందేశాలు ఇస్తోంది. అయినా అవకాశాలు రావట్లేదు. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఓ ఐటెం సాంగులో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’ సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తమన్ ఓ సూపర్బ్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశాడు. దీంతో ఈ సాంగులో ఎవరైనా హీరోయిన్‌తో చేయిస్తే బాగుంటుందని భావించిన మూవీ యూనిట్.. కొందరు భామలను పరిశీలించారు. చివరగా ఇలియానా అయితే బాగుంటుందని భావించి, ఆమెను అప్రోచ్ అయ్యారు. గతంలో ఇతర సినిమాల్లో ఐటెంసాంగులో నటించేందుకు ససెమిరా అన్న ఈ సన్నజాజి నడుము భామ.. బాలయ్య సినిమా అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. పైగా.. రెమ్యునరేషన్ కూడా తాను అడిగినంత ఇస్తామని యూనిట్ చెప్పడంతో ఇలియానా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంది. ఈ నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.

ఇదిలావుండగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘డిక్టేటర్’ షూటింగ్ 80% పూర్తికాగా.. ఇంకా రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్‌ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa beauty ileana item song  balakrishna dictator  

Other Articles