Surya Pratap Clarifies on Rape scenes in Kumari 21F Movie

Surya pratap clarifies on rape scenes in kumari 21f movie

No Rape scenes in Kumari 21F Movie, Kumari 21F Movie Release Date, Kumari 21F Movie Posters, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Surya Pratap Clarifies on Rape scenes in Kumari 21F Movie: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie Release on 20 November.

హీరోయిన్ పై రేప్ జరగలేదంటున్న సూర్యప్రతాప్

Posted: 11/13/2015 12:56 PM IST
Surya pratap clarifies on rape scenes in kumari 21f movie

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ‘కరెంట్’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను రేప్ చేసే సన్నివేశాలున్నాయంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ దర్శకుడు సూర్యప్రతాప్ ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ వార్తలపై సూర్యప్రతాప్ స్పందిస్తూ... ఈ వార్తలు నేను కూడా విన్నాను. కానీ ఇందులో ఎలాంటి రేప్ సీన్లు లేవు. ఓ సీన్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చిన సైకలాజికల్ సంఘర్షణను చూపించాం. అందులో ఎలాంటి వల్గారిటీ వుండదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన వస్తోంది. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫిని, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  No Rape scenes  Raj Tarun  Sukumar  Release Date  Hebha patel  

Other Articles