Naga Shourya | Abbai Tho Ammai | Release Date

Abbai tho ammai movie release date

Abbai Tho Ammai Release Date, Abbai Tho Ammai Audio, Naga Shourya Abbai Tho Ammai trailer, Naga Shourya Abbai Tho Ammai, Naga Shourya movie news, Naga Shourya movie updates, Naga Shourya latest news, Naga Shourya film updates, Naga Shourya new movie details, Naga Shourya stills, Naga Shourya

Abbai Tho Ammai Movie Release Date: Actor Naga Shourya latest Film Abbai Tho Ammai. Ramesh Varma direction. Abbaitho Ammai theatrical trailer. music by Ilaiyaraja. produced by Kireeti Potini.

డిసెంబ‌ర్ 25న ‘అబ్బాయితో అమ్మాయి’

Posted: 11/28/2015 10:32 AM IST
Abbai tho ammai movie release date

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువత జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి`. నాగశౌర్య‌, ప‌ల్ల‌క్ ల‌ల్వాని జంట‌గా న‌టించారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. రీరికార్డింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది.

Video Courtesy : idlebrainlive

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ``లెజండ‌రీ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మేస్ట్రో ఇళ‌య‌రాజాగారు అందించిన పాట‌ల‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశాం. విన్న‌వారంద‌రూ చాలా బావున్నాయ‌ని ఫోన్లు చేస్తున్నారు. పాట‌ల‌కు స‌ర్వ‌త్రా మంచి స్పంద‌న వ‌స్తోంది. రీరికార్డింగ్ పూర్త‌యింది. అన్నీ ప‌నుల‌ను పూర్తి చేసి క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తాం. మా సినిమా పోస్ట‌ర్స్ ఫ్రెష్‌గా ఉన్నాయ‌ని ప‌లువురు కితాబిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నమైన లవ్ స్టోరీతో హార్ట్ టచింగ్ గా సాగే చిత్రం ఇది. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ మాస్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. రమేశ్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. చాలా ట్రెండీగా, పొయిటిక్ గా తీశారు. ఆయనకు మంచి విజన్ ఉంది. నాగశౌర్య టైలర్ మేడ్ పాత్ర చేశాడు. తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. కథానాయిక పల్లక్ లల్వాని అందచందాలు, అభినయం ప్లస్ పాయింట్. లవ్ స్టోరీస్ లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచే చిత్రం అవుతుంది'' అని చెప్పారు.

బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shourya  Abbai Tho Ammai  Release Date  Trailer  Movie News  stills  

Other Articles