Krishnam Raju registered Dhanda title for Prabhas

Krishnam raju registered dhanda title for prabhas

Prabhas Dandha, Krishnam Raju register Dandha title, Prabhas Dandha Movie, Prabhas latest news, Prabhas movies, Prabhas movie news, Prabhas movie updates, Prabhas stills, Prabhas

Krishnam Raju registered Dhanda title for Prabhas: Rebel Star Krishnam Raju register Dandha title for Young Rebel star Prabhas.

ప్రభాస్ తో రెబల్ స్టార్ ‘దందా’ చేస్తాడా?

Posted: 11/30/2015 05:50 PM IST
Krishnam raju registered dhanda title for prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ‘బాహుబలి’ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకుంటున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడోనని అందరిలో గతకొద్ది కాలంగా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకున్నారు. ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తూనే వున్నాయి.

కానీ కృష్ణంరాజు సినిమాకు సరైన సమయం దొరకడం లేదు. అయితే తాజాగా కృష్ణంరాజు తన హోం బ్యానరైన గోపికృష్ణ మూవీస్ పై ‘దందా’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. మరి ఈ టైటిల్ ప్రభాస్ కోసం రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ టైటిల్ తో సినిమాను కృష్ణంరాజు తీస్తాడా లేక వేరే దర్శకుడికి అవకాశం ఇస్తాడో భవిష్యత్తులోనే తెలియనుంది.

ప్రస్తుతం ‘బాహుబలి2’ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించి, కలెక్షన్ల మోత మోగించింది. ఈసారి ‘బాహుబలి2’ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించి, కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడానికి ‘బాహుబలి’ టీం సిద్ధమవుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Krishnam Raju  register  Dandha  stills  

Other Articles