హీరోయిన్ గా నటిస్తే తర్వాత సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో తెలియదు కానీ... రూమర్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంటాయి. సినిమా హిట్టయ్యిన, కాకపోయినా, హీరోతో క్లోజ్ గా వున్నా, లేకపోయినా.... ఇలా ప్రతి విషయంలో హీరోయిన్లపై వార్తలు రావడం ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయ్యిందే. అయితే ఇలాంటి వాటిని తన కెరీర్ లో ఎన్నో చూసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ విషయాలను తేలికగా తీసుకుందట.
ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రాను గతకొద్ది కాలంగా వెంటాడుతున్న రూమర్ ప్రేమ-పెళ్లి. ఈ రూమర్ గతకొద్ది రోజులుగా ప్రియాంక చోప్రాను వెంటాడుతోంది. ఈ అమ్మడు ఎక్కడికెళ్లినా కూడా..‘మీరు ఎవరో ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారట? మీ పెళ్లెప్పుడు? మీకు ఎలాంటి వ్యక్తి మొగుడిగా కావాలి? అంటూ ప్రశ్నలు వినిపిస్తూ వుంటాయి.
అయితే ఈ విషయాలను నేరుగా ప్రియాంక చోప్రాను అడగకుండా మీడియా వారే ఏదేదో ఊహించేసుకొని రాసేస్తున్నారట. తననే నేరుగా వచ్చి ఎప్పుడు అడుగుతారా అని ప్రియాంక చోప్రా ఇంతకాలం ఎదురుచూసిందట. అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా ఓ క్లారిటీ ఇచ్చేసింది. తనకు ఎవరితోనూ ఎఫైర్ లేదని తెలిపింది. అంతేకాకుండా తాను చేసుకోబోయే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ వుండాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి చాలా ఉత్సాహంగా వుండాలి. ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడటానికి అస్సలు భయపడకూడదు. ధైర్యంగా మాట్లాడాలి. నన్ను ప్రేమగా చూసుకోవాలి. అలాంటి వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది.
మరి ఈ అమ్మడికి నచ్చిన వ్యక్తి ఎప్పుడు కనిపిస్తాడో, ఎప్పుడు అతనిని పెళ్లి చేసుకుంటుందో భవిష్యత్తులోనే తెలియనుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more