Tollywood for Mana Madras Kosam

Tollywood for mana madras kosam

Telugu cine stars starts Mana Madras Kosam, Mana Madras Kosam stills, Mana Madras Kosam news, Mana Madras Kosam updates, Mana Madras Kosam stars, tollywood stars, Chennai floods victims

Tollywood for Mana Madras Kosam: In solidarity with the people of chennai and Tamilnadu affected by the floods.

‘మన మద్రాస్ కోసం’ అంటున్న టాలీవుడ్

Posted: 12/05/2015 05:21 PM IST
Tollywood for mana madras kosam

ప్ర‌కృతి బీభ‌త్సానికి చెన్నై న‌గ‌రం వ‌ణికింది. అకాల వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లతో చెన్నై న‌గ‌రం నీట మునిగింది. అనేక మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. క‌నీస ప్రాథ‌మిక అవ‌స‌రాల కోసం ఆర్తితో ఎదురుచూస్తున్నారు. మ‌నిషి క‌ష్టంలో ఉన్న‌ప్పుడు తోటి మ‌నిషే అండ‌గా నిల‌బ‌డాలి. ఇప్పుడు చెన్నై న‌గ‌రానికి అండ‌గా తెలుగు సినిమా ప‌రిశ్రమ‌లో హీరోలు, ప్ర‌ముఖులు చేయి చేయి క‌లిపి తామున్నామంటూ భ‌రోసాను క‌ల్పిస్తున్నారు. తమ‌తో పాటు ప్ర‌జ‌ల‌ను కూడా ఇందులో భాగం చేయ‌డానికి పలు ప్రాంతాల‌ను సంద‌ర్శించి విరాళాల‌ను సేక‌రిస్తున్నారు. మంచు ల‌క్ష్మి స‌హా ద‌గ్గుబాటి రానా, మంచు మ‌నోజ్‌, అల్ల‌రి న‌రేష్‌, నాని, నిఖిల్‌, మ‌ధుశాలిని, న‌వ‌దీప్‌, అల్లుశిరీష్‌, తేజ‌స్విని `మ‌న మ‌ద్రాసు కోసం` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ ప‌ది హీరో హీరోయిన్లు డిసెంబ‌ర్ 6, ఆదివారం సాయంత్రం 4 గంట‌ల నుండి 7 గంట‌ల వ‌ర‌కు సుజ‌నా . మంజీరా మాల్‌, ఇనార్బిట్ మాల్‌ల‌ను సంద‌ర్శించి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారి నుండి విరాళాల‌ను సేక‌రిస్తారు. సేకరించిన మొత్తాన్ని చెన్నై బాధితుల‌కు చేరేలా కార్య‌చ‌ర‌ణ రూపొందించామ‌ని వారు తెలియ‌జేశారు. ఒక‌వేళ ఎవ‌రైనా విరాళాల‌ను పంపాల‌నుకునేవారు క్రింది చిరునామాకు విరాళాలను అంజేయ‌వ‌ల‌సిందిగా తెలియ‌జేశారు.

రామానాయుడు చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ అకౌంట్ నెంః 18090200000113
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా,
జూబ్లీహిల్స్ బ్రాంచ్‌, హైద‌రాబాద్‌
IFSCCODE:BARB0JUBILE‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mana Madras Kosam  Tollywood stars  Chennai Floods Peoples  Help  

Other Articles