చెన్నై వరద బాధితుల సహాయం కోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీనటులు విరాళాలు సేకరించడానికి వెళ్లి, అభిమానుల అత్యుత్యాహం వల్ల పరుగో పరుగులు పెట్టేసారు. హైదరబాద్ నగరంలో బాగా రద్దిగా వుండే ఓ ప్రముఖ మాల్ లో విరాళాలను సేకరించడానికి నటీనటులు లక్ష్మీ మంచు, రానా, కాజల్, మధుశాలిని, నిఖిల్, తేజస్వీలు వెళ్లారు.
హీరోహీరోయిన్లు వస్తున్నారని తెలియడంతో వీరిని చూడటానికి అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ మాల్ అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆ స్టేజ్ వద్దకు వెళ్లడానికి ఈ తారలకు చాలా సమయం పట్టింది. ఈ నటీనటులను తమ సెల్ ఫోన్లలో బంధించడానికి జనాలు తెగ ప్రయత్నించారు.
జనాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించిన నిర్వాహకులు, పోలీసులు, బౌన్సర్లు కూడా చేతులెత్తేసారు. దీంతో జనాల తోపులాట మరీ ఎక్కువ అవుతుండటంతో ఈ నటీనటులంతా పక్కనే వున్న స్టార్ బక్స్ లోకి పరుగులు తీసారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. విరాళాలు సేకరించాలనే వారి ప్రయత్నం అంతా కూడా రసభసగా ముగిసిపోయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more