Vijayendra Prasad says Prabhas out from Baahubali 3

Vijayendra prasad says prabhas out from baahubali 3

Prabhas out from Baahubali 3, Prabhas exit from Baahubali 3, Baahubali 3 latest update, Baahubali 3 news, Baahubali 3 cast, Baahubali2 movie news, Baahubali2 movie updates, Baahubali2, Prabhas, Anushka, Rana, Tamannah, Ramyakrishna stills

Vijayendra Prasad says Prabhas out from Baahubali 3: Young rebel star latest block buster film Baahubali. SS Rajamouli direction. Now Baahubali sequel ready for shooting.

‘బాహుబలి3’కి యంగ్ రెబల్ స్టార్ దూరం

Posted: 12/08/2015 11:09 AM IST
Vijayendra prasad says prabhas out from baahubali 3

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ గా ‘బాహుబలి2’ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ప్రస్తుతం ‘బాహుబలి2’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘బాహుబలి’ సినిమాలో టెక్నికల్ పార్ట్ కాకుండా యాక్టింగ్ పరంగా తీసుకుంటే ప్రభాస్ లేకుండా ‘బాహుబలి’ సినిమా లేదనే చెప్పుకోవాలి. ఇందులో ప్రభాస్ తనదైన శైలిలో రాజసం, హీరోయిజంతో అదరగొట్టేసాడు.

బాహుబలి, శివుడు పాత్రలలో ప్రభాస్ జీవించేసాడు. అలాంటి ఈ ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా త్వరలోనే ‘బాహుబలి3’ రాబోతుంది. కానీ ఈ ‘బాహుబలి3’లో మాత్రం ప్రభాస్ వుండడని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేసారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ పనులు మొదలెట్టేసారు. ఇందులో ప్రభాస్, సత్యరాజ్, రమ్యకృష్ణ వంటి పలు పాత్రలు కనిపించవంటూ ఆయన స్పష్టం చేసారు.

‘బాహుబలి3’లో ప్రభాస్ వుండటం లేదని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేయడంతో... ‘బాహుబలి3’లో ఎవరూ కనిపించబోతున్నారో అని ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ అంతా కూడా చర్చనీయాంశమైంది. ప్రభాస్ అభిమానులకు ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా వున్నారు. అయితే ప్రభాస్ కాకపోతే... ‘బాహుబలి3’లో ఏ హీరో అయితే బెటర్ అనే దానిపై సినీవర్గాలు అంచనాలు వేస్తున్నారు.

‘బాహుబలి3’ కోసం సూర్య, విక్రమ్, రణవీర్ సింగ్, జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ‘బాహుబలి3’ గురించి అసలు నిజాలు తెలియాలంటే 2016 చివర వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ‘బాహుబలి2’ కోసం ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్, అనుష్కలు షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali3  Prabhas  Anushka  Rana  Tamannah  stills  

Other Articles