Lachchimdeviki O Lekkundhi Movie on January 1

Lachchimdeviki o lekkundhi movie on january 1

Lachchimdeviki O Lekkundhi Release Date, Lachchimdeviki O Lekkundhi Censor Report, Lachchimdeviki O Lekkundhi stills, Lachchimdeviki O Lekkundhi trailers, Lachchimdeviki O Lekkundhi movie updates, Lachchimdeviki O Lekkundhi Movie News, Lachchimdeviki O Lekkundhi, Naveen Chandra, Lavanya Tripathi stills, Lavanya Tripathi latest stills

Lachchimdeviki O Lekkundhi Movie on January 1: Naveen Chandra and Lavanya Tripathi starrer 'Lachchimdeviki O Lekkundhi' was directed by Jagadish Thalasila and was produced by Sai Prasad Kamineni on Mayukha Creations. The movie is getting its censor formalities done at the moment and is all set for a grand release on January 1, 2016, on the new year's day.

న్యూ ఇయర్ కానుకగా లచ్చిందేవికి ఓ లెక్కుంది

Posted: 12/10/2015 09:57 AM IST
Lachchimdeviki o lekkundhi movie on january 1

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జగదీశ్‌ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్‌ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రానికి సంగీతం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్‌ 2016 కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగదీశ్‌ తలశిల మాట్లాడుతూ....''అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రూపుదిద్దుకుంది. అల్రెడీ ఎస్‌.ఎస్‌. రాజమౌళిగారి చేతుల మీదుగా విడుదల అయిన ఆడియోకి శ్రోతల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఎమ్‌. ఎమ్‌. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌ కానుంది. ఉత్కంఠ భరితంగా అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్‌ 2016 కానుకగా..జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము...'' అన్నారు.

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్‌, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి; పాటలు: శివశక్తిదత్తా, అనంతశ్రీరాం; ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు; డిఓపి: ఈశ్వర్‌; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఈ. మధుసూదన్‌రావు; నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని; రచన-దర్శకత్వం: జగదీశ్‌ తలశిల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lachchimdeviki O Lekkundhi  Release Date  Lavanya Tripathi  Naveen Chandra  stills  

Other Articles