ప్రేమ అనే ఒక పిచ్చి పట్టేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేకు. గతంలో దీపికా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ తో ప్రేమలో మునిగితేలుతోంది దీపికా. రణ్‌వీర్ తో ప్రేమలో పడ్డాకా... ఈ అమ్మడి పిచ్చి భారీ లెవల్స్ కు వెళ్లినట్లుగా కనిపిస్తుంది. మీడియా ముందు చెప్పకూడని కొన్ని కొన్ని డైలాగ్స్ ను చెప్పేస్తోంది.
గతకొద్ది కాలంగా రణ్‌వీర్ సింగ్, దీపికాలు ప్రేమ పేరుతో షికార్లు, రొమాన్స్ చేస్తున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోకుండా ఇలాగే రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారా అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు విసుగెత్తిపోయిన దీపికా.. ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘భాజీరావ్ మస్తానీ’ చిత్రం ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో వీరిద్దరూ బిజీగా వున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా తన ప్రేమ వ్యవహారం గురించి తెలియజేస్తూ... రణ్‌వీర్ నాకు మంచి స్నేహితుడు. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. త్వరగా హర్ట్ అయిపోతా. కానీ, రణ్‌వీర్ మాత్రం నన్ను హర్ట్ చేయడు. మా ఇద్దరి మధ్య ఎంత నమ్మకం వుందంటే.. నేను అతని ముందు నగ్నంగా కూడా వుండి, చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వగలను. అంతగా ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. నా ఆత్మ రణ్ వీర్ కు ఇచ్చేసినా కూడా నేను హాయిగా బతకగలననే నమ్మకం వుంది. ఇది చాలా పవిత్రమైన బంధం అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
రణవీర్ తో తన ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేసిన దీపికా.. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కాబట్టే.. దీపికా ఇలా స్పందించిందంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి ఈ అమ్మడు ఈ రేంజులో క్లారిటీ ఇచ్చాక రణ్ వీర్ ను పెళ్లి చేసుకుంటుందో లేక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందో భవిష్యత్తులోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more