dhanush-next-confirmed-with-shamili

Will shamili suceed in kollywood as actress

Ajith,Thala ajith,Shamili,Shamilee,Theri,Vijay,Vijay ajith rivalry,Veeraj sivaji,Ajith sister in love,Tamil movie theri

after a gap of years rumours surrounding in kollywood industry, that will Thala Ajith's Sister-in-Law Shamili succeed as herione in industry.

నటిగా షామిలి రాణిస్తుందా..? కోలీవుడ్ గుసగుసలు

Posted: 12/25/2015 08:22 PM IST
Will shamili suceed in kollywood as actress

నటి షామిలీ కథానాయికగా రాణిస్తుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదో చర్చగా మారింది. లిటిల్ స్టార్ షామిలి సాధించిన పేరు ప్రఖ్యాతలు అద్భుతం. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. రెండేళ్ల పసి వయసులోనే అంజలి చిత్రంలో మానసిక రుగ్మతలో బాధ పడే చిన్నారిగా అద్భుతమైన హావభావాలను కనబరచి సినీ పండితులను సైతం అబ్బుర పరచారు. ఆ వయసులోనే జాతీయ అవార్డును గెలుచుకుంది.
 
అదంతా ఒక చరిత్రే అయితే నాయకిగా కొంత కాలం క్రితం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఓయ్ అంటూ అక్కడి ప్రేక్షకుల్ని పలకరించిన షామిలి ఆ తరువాత పై చదువులకు అమెరికా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 28 ఏళ్ల వయసులో కోలీవుడ్‌లో కథానాయకిగా పరిచయం అవుతున్నారు. విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తరువాతే షామిలికి కోలీవుడ్ ఏ స్థాయిని అందిస్తుందో తెలుస్తుంది. అయితే హీరోయిన్‌గా ఆలస్యంగా ఎంట్రీ అయిన షామిలి ప్రస్తుత కథానాయికలకు ఏ పాటి పోటీ ఇస్తారన్నదే చర్చనీయంగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress shamili  Dhanush  Kollywood  

Other Articles