ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా నాన్నకు ప్రేమతో ఆడియో లాంఛ్ అట్టహాసంగా జరిగింది. నందమూరి హరికృష్ణ ముఖ్య అతిథిగా ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా సాగింది. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, సుకుమార్, నందమూరి కళ్యాణ్ రామ్, జగపతిబాబులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ ఎంతో ఎమోషనల్ గా జరిగింది. దేవీశ్రీప్రసాద్ ఈ ఆడియోను తన తండ్రి సత్యమూర్తికి అంకితమిచ్చినట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి ఆడియోని రిలీజ్ చేసి మొదటి సిడిని హరికృష్ణకి అందించారు. ఇది తన సినిమా కాదు సుకుమార్ జీవితం... తన పాత్రలో సుకుమార్ ని ఊహించుకోవాలని ఎన్టీఆర్ తెలిపారు. తల్లి తండ్రులతో పాటు అందరి అమ్మ నాన్నలకు మేమిస్తున్న నీరాజనం ఈ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అని ఎన్టీఆర్ అన్నారు. అంతేకాదు, తారక్ చేత ఈ సినిమాలో దేవీ ఓ పాటను కూడా పాడించాడు. ఎన్టీఆర్ సాంగ్‌ను చాలా బాగా పాడాడని కితాబిచ్చాడు. ఆ పాట మరేదో కాదు.. ఫస్ట్ లుక్‌లోనే అభిమానుల మనసు దోచుకున్న ఫాలో.. ఫాలో సాంగట. ఇంకేముంది, నందమూరి అభిమానులకు దేవీశ్రీ ప్రసాద్ మరోసారి పాటల విందును అందించబోతున్నాడనమాట.
ఇక సినిమా ట్రైలర్ నందమూరి అభిమానులకు కనువిందు చేస్తోంది. పాటలు అదిరిపోయేలా ఉంటే.. సినిమా ట్రైలర్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. టెంపర్ సినిమా హిట్ తర్వాత సుకుమార్ తో ఎర్టీఆర్ చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్ రికార్డ్ స్థాయిలో యుట్యూబ్ లొ హిట్స్ ను సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సత్తా చాటింది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more