Rajinikanth | Amitabh Bachchan | Hot comments

Rajinikanth rejects amitabh bachchan

Amitabh Bachchan comments on Rajinikanth, Amitabh Bachchan talks about Rajinikanth, Rajinikanth rejects Amitabh Bachchan, Amitabh Bachchan latest news, Amitabh Bachchan latest interview, Amitabh Bachchan, Rajinikanth movies, Rajinikanth

Rajinikanth rejects Amitabh Bachchan: Tamil Super Star Rajinikanth latest film 2.0. Shanker Director, Amy jackson heroine. Akshay kumar acts in lead roles.

అమితాబ్ ను వద్దని చెప్పిన సూపర్ స్టార్

Posted: 01/04/2016 11:03 AM IST
Rajinikanth rejects amitabh bachchan

గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘2.0’ పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఇందులో విలన్ పాత్ర కోసం ముందుగా దర్శకుడు శంకర్ తనని సంప్రదించారని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా గురించి అమితాబ్ మాట్లాడుతూ... శంకర్ తనను ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం సంప్రదించగానే, తాను వెంటనే రజనీకి ఫోన్ చేసానని, కానీ రజనీ వెంటనే తనను విలన్ గా యాక్సెప్ట్ చేయలేరని, అందుకే చెప్పమని అన్నారని అమితాబ్ చెప్పుకొచ్చాడు.

ఈ పాత్రలో తనను నటించొద్దని రజనీ సూచించారని, అందుకే నటించడానికి ఒప్పుకోలేదని బిగ్‌ బి తెలిపారు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం అక్షయ్ కుమార్ తన బాడీ ఫిట్ నెస్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. డిసెంబర్ 16నుంచి ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో రజనీ పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Amitabh Bachchan  Hot comments  stills  

Other Articles