Jagapathi Babu | Clarifies | NTR | Balakrishna | Cold war | Nannaku Prematho

Jagapathi babu talks about ntr balakrishna cold war

Jagapathi Babu Clarifies on NTR Balakrishna Cold war, Jagapathi Babu NTR Interview, Theaters Problems for Nannaku Prematho, Nannaku Prematho Theaters Problems, Theaters war Nannaku Prematho, Nannaku Prematho vs Dictator, Nannaku Prematho theaters list, Nannaku Prematho hot news, Nannaku Prematho movie updates, Nannaku Prematho

Jagapathi Babu talks about NTR Balakrishna Cold war: Young tiger Ntr Nannaku Prematho film will be releasing tomorrow. 13 january pongal special. Jagapathi babu plays a villain role. Sukumar direction.

ఎన్టీఆర్-బాలయ్యల కోల్డ్ వార్ పై జగ్గుబాయ్ క్లారిటీ

Posted: 01/12/2016 03:24 PM IST
Jagapathi babu talks about ntr balakrishna cold war

నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఆజ్యం పోసే విధంగా వీరిద్దరి సినిమాలు కూడా సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి. దీంతో ఈ వార్తల్లో పూర్తిగా నిజం వుందని అభిమానులు, తెలుగు ప్రజలు భావిస్తున్నారు.

ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతుంది. ఆ మరుసటిరోజు అనగా.. జనవరి 14న సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ చిత్రం విడుదలవుతుంది. దీంతో వీరిద్దరి మధ్య వున్న కోల్డ్ వార్ కాస్త సినిమాల ద్వారా పోటీపడుతున్నారంటూ సినీవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరిలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందోనని అటు అభిమానులతో పాటుగా, ఇటు సినీ వర్గాలు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇటీవలే బాలయ్య ‘డిక్టేటర్’ ఆడియో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ... నాకెప్పుడూ నా సినిమాలే పోటి. నేను వేరే వాళ్ల గురించి ఆలోచించను. ఇంకెవరైనా పోటీ వుంటే ముందుముందు నటిస్తాను. నేనున్నాను.. నా అబ్బాయి, నా మనవడు వున్నాడు. ఇక నాకెవరూ లేరు పోటీ. అది మాత్రం నూటికి నూరుపాళ్లు ఖాయం అని ఓ క్లారిటీ ఇచ్చేసాడు. బాలయ్య మాటలపై అభిమానులు మరింత కంగారుపడుతున్నారు.


idlebrainlive

ఇక ఎన్టీఆర్ కు బాలయ్యకు మధ్య పూర్తిగా చెడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం బాలయ్యతో ఎలాంటి వైరం లేకుండా, అందరూ కలిసి వుందామనే ఆలోచనలో వున్నట్లుగా స్పష్టం అయ్యింది. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జగపతిబాబుతో కలిసి ఎన్టీఆర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో బాలయ్య-ఎన్టీఆర్ ల కోల్డ్ వార్ జరుగుతుందంటూ వస్తున్న వార్తల గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ... తారక్.. బాలయ్యది మీది సమస్య ఏంటి? బాగుంటే బాగుంటది కదా అని అడిగాను. ఎన్టీఆర్ క్లియర్ గా ఒకటే చెప్పాడు. ఆయనతో నాకెం ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన నా ఫాదర్ బ్రదర్. నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. నేనెందుకు గొడవ పెట్టుకుంటాను, మనసులో పెట్టుకుంటాను? ఎప్పటికైనా నేను ఒపెన్ గా రెడీ ఫర్ ఎనీ థింగ్ అని క్లియర్ గా చెప్పాడు అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా... మా ఇద్దరి మధ్య వచ్చిన డిస్కషన్లో ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. ఆ విషయంలో చాలా అప్రిసియేట్ చేయాలి. ఇతను అంత క్లియర్ గా వున్నప్పుడు అందరికి తెలియాలి అని జగపతిబాబు క్లారిటీ ఇచ్చేసాడు. మొత్తానికి ఎన్టీఆర్ మాత్రం బాలయ్యతో కలిసిపోవాలని ఎదురుచూస్తున్నట్లుగా అర్థమవుతోంది. మరి ఎన్టీఆర్ ను బాలయ్య ఎప్పుడు ఆహ్వానిస్తాడో చూడాలి. ఈ వార్త మాత్రం నందమూరి అభిమానులకు కాస్త సంతోషకరమైన వార్త అనే చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  Clarifies  NTR  Balakrishna  Cold war  Nannaku Prematho  

Other Articles