సిగ్గులేదురా.. మనిషివా దున్నపోతువా.. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా.. నీచుడా.. దరిద్రుడా... అనే ఇలాంటి పదాలు ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలోని ఒక కమెడియన్ వద్దనే వినిపిస్తూ వుంటాయి. అతనే చలాకీ చంటి. ‘జబర్దస్థ్’ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని, ప్రస్తుతం వరుస సినిమాలతో ఆర్టిస్టుగా బిజీగా వున్న చలాకీ చంటిని ఓ వ్యక్తి మెంటల్ టార్చర్ పెట్టేసాడు. తనను మానసికంగా గురిచేయడమే కాకుండా, ప్రభాస్ అభిమానులందరి చేత కూడా తనను చాలా బాధపెట్టాడని చంటి ఆవేదన వ్యక్తం చేసాడు.
ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఏంటి ఆ సంఘటన అని అనుకుంటున్నారా? అసలు విషయమేమిటంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను చంటి ‘బకరా’ అని అన్నాడనే సమాచారంతో రాజు... చంటిని అసభ్యపదజాలంతో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వార్త భారీగా ప్రచారం అయిపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులంతా కూడా చంటిని తీవ్ర స్థాయిలో అసభ్యపదజాలంతో దూషించడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న చంటి.. ఆ వ్యక్తి వివరాలను తెలుసుకొని, నేరుగా ఆ వ్యక్తిని ఆ జిల్లా డీఎస్పీ గారి ముందు నిలబెట్టారు.
Click Here for Chalaki Chanti Controversy Video
దీంతో తన తప్పు తెలుసుకున్న సదరు వ్యక్తి తన తప్పును తెలుసుకొని, చంటికి క్షమాపణలు చెప్పుకొచ్చాడు. అలాగే ఈ విషయంపై చంటి మాట్లాడుతూ... ఏదైనా ఒక విషయం పూర్తిగా తెలుసుకొని, ప్రత్యక్షంగా చూస్తేనే తప్ప ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేయకండి. ప్రభాస్ అభిమానులకు నా విన్నపం.. నేను ఎవరిని హర్ట్ చేసే విధంగా కామెంట్లు చేయలేదు. ఆర్టిస్ట్ గా కష్టపడి పైకొస్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి అని చంటి తన ఆవేదనను చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more