Aamir khan | Sunny Leone | Mastizaade | Interviews | Release Date | Hot stills

Aamir khan wants to work with sunny leone

Aamir khan Ready to work with Sunny Leone, Aamir khan comments on Sunny Leone, Aamir khan with Sunny Leone, Bollywood Cine Celebrities supports to Sunny Leone, Sunny Leone latest interview, Sunny Leone interviews, Sunny Leone latest news, Sunny Leone hot news, Sunny Leone hot stills, Sunny Leone hot updates, Sunny Leone

Aamir khan wants to work with Sunny Leone: Mastizaade is an upcoming Indian Bollywood film, directing by Milap Zaveri and producing by Pritish Nandy. Starring Sunny Leone in a lead role.

పోర్న్ స్టార్ తో రొమాన్స్ కు సిద్ధమంటున్న ఆమీర్

Posted: 01/20/2016 06:18 PM IST
Aamir khan wants to work with sunny leone

గతకొద్ది కాలంగా పోర్న్ స్టార్ క్రేజ్ తో సతమతమవుతున్న సన్నీలియోన్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మద్ధతు లభిస్తోంది. మొన్నటివరకు సన్నీలియోన్ కేవలం తన అందాలను మాత్రమే చూపిస్తూ, సినిమా అవకాశాలను దక్కించుకుంటోందని వార్తలొచ్చాయి. అంతేకాకుండా చాలా మంది మహిళలు, సినీ భామలు సైతం సన్నీలియోన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే తాజాగా ఈ అమ్మడు పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ సన్నీలియోన్ పై మంచి టాక్ ను తెచ్చిపెట్టింది. సన్నీలియోన్ నటించిన తాజా చిత్రం ‘మస్తీజాదే’. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సన్నీలియోన్ ఓ టీవి ఛానెల్ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. సన్నీలియోన్ ను చాలా వరకు పోర్న్ స్టార్ గానే టార్గెట్ చేస్తూ సదరు యాంకర్ ప్రశ్నలను సంధించారు.

కానీ సన్నీలియోన్ మాత్రం చాలా ఓపికగా, ధైర్యంగా, చాలా స్పష్టంగా సమాధానాలిచ్చింది. ఇందులో సదరు యాంకర్... ఆమీర్ తో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో కలిసి ఆమీర్ నటిస్తాడని అనుకుంటున్నారా? అనే ప్రశ్నను అడిగారు. అయితే సీన్ కట్ చేస్తే.. ఈ విషయంపై ఆమీర్ ఖాన్ చాలా సంతోషంగా సమాధానమిచ్చాడు.

సన్నీలియోన్ పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ గురించి, మరియు సన్నీలియోన్ మాట్లాడిన పద్ధతిపై ఆమీర్ ఖాన్ స్పందిస్తూ... ఆ ఇంటర్వ్యూలో సన్నీలియోన్ ఎంతో హుందాగా, సహనంతో ప్రవర్తించింది. అక్కడ నేనున్నా ఇంటర్వ్యూయర్‌కి ఇవే సమాధానాలు చెప్పాలనుకునేవాడిని. ఔను! సన్నీ.. నీతో కలిసి పనిచేయడం ఆనందిస్తాను. నీ ‘గతం’తో నాకు ఎలాంటి సమస్య లేదంటూ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అమీర్ స్పందించాడు.

ఇక అమీర్ మాటలకు సన్నీలియోన్ ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఆయన ఇచ్చిన మద్ధతుకు సన్నీలియోన్ కృతజ్ఞతలు తెలిపింది. మొత్తానికి సన్నీలియోన్ పై వున్న పోర్న్ స్టార్ అనే భావనను ఒక ఇంటర్వ్యూ పూర్తిగా మార్చేస్తోందని చెప్పుకోవచ్చు. మరి అమీర్ సినిమాలో సన్నీలియోన్ ఎప్పుడు, ఎలా కనిపించనుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir khan  Sunny Leone  Mastizaade  tweets  Release Date  Hot stills  

Other Articles