యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై ఇటీవలే ప్రభాస్ పెద్దనాన్న అయినటువంటి ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ తనకు మాట ఇచ్చాడని, కాబట్టి ప్రస్తుతం ప్రభాస్ కోసం ఓ మంచి అమ్మాయిని ఫైనలైజ్ చేయడంలో మా ఫ్యామిలీ మెంబర్స్ బిజీగా వున్నారని కృష్ణంరాజు స్పష్టం చేసాడు.
ఈ ఒక్కమాటతో ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది జరగడం ఖాయమని అర్థం చేసుకున్న అభిమానులు.. ప్రభాస్ కు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోయే ఆ వధువు ఎవరా అని తెగ ఆరాటపడిపోతున్నారు.
ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ప్రభాస్ కు ప్రస్తుతం పోటీగా వున్న మరో నటుడు రానా. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి2’. అయితే ఇలాంటి బాహుబలి(ప్రభాస్) పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న రానా... బాహుబలి కోసం ఓ పెళ్లి ప్రకటనను విడుదల చేసాడు. బాహుబలి(ప్రభాస్)ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి వుండాల్సిన లక్షణాలు, అలవాట్లు విషయంపై సరదాగా ఓ ప్రకటనను తన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.
ఇపుడు మీరు చూస్తున్న ఈ ప్రకటన బాహుబలి(ప్రభాస్) కోసం రానా పోస్ట్ చేసిందే. మరి రానా చెప్పిన లక్షణాలున్న అమ్మాయి అంటే అందాల భామ అనుష్క కరెక్ట్ జోడి అని అనిపిస్తోంది. ఏదైమైనా రానా పోస్ట్ చేసిన ఈ సరదా ప్రకటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more