‘కిల్లింగ్ వీరప్పన్’ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వంగవీటి’ పేరుతో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య మరియు రాజకీయ, వ్యక్తిగత జీవితం ఆధారంగా రూపొందనున్నట్లుగా ఇప్పటికే వర్మ ప్రకటించేసాడు. అయితే ఈ సినిమాలోని అత్యంత కీలకమైన పాత్ర వంగవీటి రాధ. ఈ పాత్రలో నటించబోయే వ్యక్తికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.
అంతే కాకుండా వర్మ ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రింది విధంగా కామెంట్లు కూడా చేసారు వర్మ. ‘వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు’. ‘వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు’. ‘కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారు’ అంటూ ట్వీట్ చేసాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందోననే ఆసక్తి మొదలయ్యింది.
ఇటీవలే వర్మ రూపొందించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా కోసం అచ్చం వీరప్పన్ లాగే వుండే సందీప్ భరద్వాజను సెలెక్ట్ చేసి, ఆ పాత్రలో నిజమైన వీరప్పన్ చేసాడా అనిపించే విధంగా తెరకెక్కించాడు వర్మ. మరి ‘వంగవీటి’ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.
Vangaveeti Radha chaala thakkuva saarlu thana aantarangikula madhya cigaretlu kalchevaallu pic.twitter.com/Dc350bfeij
— Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016
Vangaveeti Radhagaariki coffee ante chaala ishtamani Vangaveeti Ranga gaaru naatho chepoaru pic.twitter.com/EZD6Uqv28D
— Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016
Kammavaalla manasthatanni ardham chesukune thelivunnavalle arhatha vunna nijamaina kaapulani chepparu pic.twitter.com/FZ8apGoXY7
— Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more