సునీల్, నిక్కిగల్రాని, డింపుల్ చోపడే హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి. ఫిభ్రవరి 19న మూవీ విడుదలైన సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సునీల్, వాసువర్మ, నిక్కిగల్రాని, డింపుల్ చోపడే, హన్సిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దిల్ రాజు మాట్లాడుతూ ‘’ కృష్ణాష్టమి విడుదలై అన్నీ చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మాస్ ఎంటర్ టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. సునీల్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాడు. తన భుజాలపై సినిమాను మోసి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మాస్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఆదరిస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ ‘’సినిమాను ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ సక్సెస్ మరిన్ని మంచి ప్రయోగాలు చేయవచ్చునే ఊపిరినిచ్చింది. దిల్ రాజుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. ఈ సినిమా కంటే ఆయనే బాగా కష్టపడ్డాడు. దర్శకుడు వాసువర్మ ఈ సినిమాలో నన్ను ఈ సినిమాలో చాలా డిగ్నిఫైడ్ గా చూపించాడు. నేను హీరోగా నటించిన సినిమాల్లో ఇదే హై బడ్జెట్ మూవీ. వాసువర్మ నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. దినేష్ మంచి రీరికార్డింగ్ ఇచ్చాడు. నిక్కి, డింపుల్ లకు థాంక్స్’’ అన్నారు.
వాసువర్మ మాట్లాడుతూ ‘’సినిమా విడుదలై ఐదు రోజులవుతున్న కలెక్షన్స్ స్టడీగా సాగుతుండటంతో చాలా హ్యపీగా అనిపించింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరో ఎదుటివారి ముఖంలో సంతోషం చూడటానికి ఎంత దూరమైనా వెళతాడు. అందువల్ల అతనికి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో విలన్స్ ముఖాల్లో కూడా సంతోషం చూడాలనుకుంటాడు ఇదే కృష్ణాష్టమి కథ. వాసువర్మకు ఒక హిట్ అయినా ఇవ్వాలని దిల్ రాజుగారు ఏర్పరుచుకున్న టార్గెట్ ఈ సినిమాతో పూర్తయింది. ప్రేక్షకుల సంతోషం కోసం మేం పడ్డ కష్టం, వారి సంతోషంతో మా ముఖాల్లో ఇప్పుడు సంతోషం కనపడుతుంది’’ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more