బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ను ఓ మహిళ చెంప చెళ్లుమనిపించిందట. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖాన్ చెప్పుకొచ్చారు. షారుక్ ఖాన్ నటిస్తున్న ‘ఫ్యాన్’ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ ఖాన్ తన పాత అనుభవాలను చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో ‘ఓ మహిళ మిమ్మల్ని కొట్టిందట కదా?’ అంటూ షారుక్ ను ఓ అభిమాని ప్రశ్నించగా.. అవునని షారుక్ అంగీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓసారి రైల్లో ప్రయాణిస్తున్నపుడు తాను రిజర్వ్ చేసుకున్న బెర్త్ పై మగాళ్లను ఎవర్నీ కూర్చోనివ్వకుండా... ఇది నా సీటు.. నేను రిజర్వ్ చేసుకున్నానంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగారట షారుక్. ఇంతలో బోగీలోకి వచ్చిన ఓ మహిళనుద్దేశించి... మీరు కూర్చోవచ్చుగానీ.. మగాళ్లు కూర్చోవడానికి వీల్లేదంటూ ఆమెకు సీట్ ఆఫర్ చేశారట షారుక్. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ‘ఇది నీది కాదు.. అందరిదీ’ అంటూ షారూక్ చెంప చెల్లుమనిపించిందని షారుక్ తన పాత అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఫ్యాన్’ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో ఏప్రిల్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more