Wait for me to announce my wedding: Bipasha Basu on Karan Singh Grover

Bipasha basu quashes engagement rumours

Bipasha Basu, Karan Singh Grover, engagement, Urmila Matondkar, Preity Zinta, Raaz, Wedding,

Bipasha Basu has denied engagement with rumoured boyfriend Karan Singh Grover after she was seen wearing a sparkler in the ring finger.

నా పెళ్లి విషయం నేను చె్ప్పే వరకు ఆగరూ..

Posted: 03/06/2016 06:13 PM IST
Bipasha basu quashes engagement rumours

తన పెళ్లి గురించి మీడియా ఇష్టానుసారం కథలు రాయకుండా.. తాను చెప్పేవరకు ఆగాలని బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసాబసు తెలిపింది. 'అలోన్' సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో బిపాసా ప్రేమలో పడిందని బాలీవుడ్ వర్గాలు కోడే కూస్తున్నాయి. అయితే ఈ విషయంపై మీడియా అంత తొందరపడి అనవసర కథనాలు రాయకండి.. దానిని హాట్ టాపిక్ గా మార్చకండీ అంటూ విన్నవించింది బిపాసా.  తాను చెప్పేవరకు తన పెళ్లి విషయంలో తొందరపడవద్దని కోరింది. గతంలో డినో మోరియా, హర్మాన్ బవేజా, సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహాంలతో పీకల్లోతు ప్రేమలో పడిన బిపాస, ఎవరినీ పెళ్లాడలేదు.

ఇక, ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ రెండో భార్యకు విడాకులు ఇంకా ఇవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బిపాసా బసు వేలికి ఉంగరం కనిపించడంతో మీడియా వివాహం గురించి ప్రశ్నించింది. దీనిపై స్పందించిన బిపాస, వివాహం గురించి వెల్లడిస్తానని, తాను పెళ్లి గురించి చెప్పే వరకు ఆగాలని సూచించింది. కాగా, ప్రియుడు కరణ్ కు అతని భార్య నుంచి ఇంకా విడాకులు మంజూరు కాకపోవడంతో వివాహం గురించి జాప్యం జరుగుతోందని బాలీవుడ్ కథనాలు వినిపిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bipasha Basu  Karan Singh Grover  engagement  Wedding  

Other Articles