Baaghi' trailer goes viral in youtube

Baaghi trailer goes viral in youtube

Baaghi: A Rebel For Love, shraddha kapoor, Tiger Shroff, Baaghi Trailer

The action packed trailer of Shraddha Kapoor and Tiger Shroff ‘s ‘Baaghi: A Rebel For Love’ has crossed two million views within 24 hours of its release on the social media platform YouTube. The three-minute trailer that was released on March 14 shows 26-year-old Tiger and the 27-year-old actress carrying out a rebellious streak.

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న బాఘీ ట్రైలర్

Posted: 03/16/2016 01:31 PM IST
Baaghi trailer goes viral in youtube

బాలీవుడ్ లో ప్రస్తుతం బాఘీ ఫీవర్ నడుస్తోంది. ఒక్క రోజులోనే 20 లక్షల మంది ఈ ట్రైలర్ చూశారు. రెండు రోజుల్లో మూడున్నర మిలియన్ మంది ఈ ట్రైలర్ ను చూశారు. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ శ్రద్దా కపూర్ ఈ సినిమాలో కత్తిలాంటి ఫైట్ సీన్లు అద్భుతంగా చేశారు. తెలుగులో వచ్చిన వర్షం చిత్రానికి ఈ సినిమా రీమేక్. ట్రైలర్‌లో టైగర్ సుమారు 30 సార్లు ఫ్లైయింగ్ కిక్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రలో తెలుగు నటులు సుధీర్‌బాబు, కోట శ్రీనివాసరావు నటిస్తున్నారు. ట్రైలర్ లో టైగర్ ష్రఫ్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో అదిరిపొయే యాక్షన్ సీన్లతో బాఘీ ట్రైలర్ దుమ్మురేపుతోంది.

{youtube}8HQIKJBUsQk|620|400|1{youtube}

ఓ వైపు సినిమాలో యాక్షన్ సీన్లు ఇరగదీస్తుంటే మరోపక్క శ్రద్దా కపూర్ తన అందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టింది. ఇక ఈ సినిమాలో విలన్ గా మహేష్ బాబు బావ సుధీర్ చాలా బాగా చేశాడని టాక్. ఈ సినిమాతో సుధీర్ కు బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని అప్పుడే క్రిటిక్స్ అంచనాలు కూడా వేస్తున్నారు. ప్రభాస్, త్రిష, గోపీచంద్ నటించిన వర్షం సినిమానే కేవలం స్టోరీ లైన్ ను వాడుకొని బాఘీని తెరకుక్కిస్తున్నారు. ఒరిజినల్ వర్షం సినిమాకు ఎలాంటి సంబందంలేదనిపించేలా బాఘీ సినిమాను రూపుదిద్దుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baaghi: A Rebel For Love  shraddha kapoor  Tiger Shroff  Baaghi Trailer  

Other Articles