సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్ ను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.... తమిళంలో నేరం సినిమా తెలుగులో రన్ అనే పేరుతో ఈ నెల 23న విడుదలవుతుంది. నాకు బాగా నచ్చి చేసిన సినిమా. యూనిట్ అందరం నమ్మి చేసిన సినిమా. ప్రతి ఒక్కరికీ టైమ్ గుడ్, బ్యాడ్ అని ఉంటుంది. అలాంటి టైమ్ ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తారు. కానీ మేం విడుదలకు ముందే టూర్ ప్లాన్ చేశాం. టూర్ ను ఈ రోజు నుండి ప్రారంభిస్తాం అన్నారు.
చిత్రనిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ.... సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 23న విడుదలవుతుంది. విడుదలకు ముందు మా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళడానికి టూర్ ప్లాన్ చేశాం. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్ లను ఈరోజు రాత్రి నుండి విజిట్ చేసి అక్కడ ప్రేక్షకుల వద్దకు సినిమాను తీసుకెళతాం ఫీల్ గుడ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది అన్నారు.
అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ.... సినిమాను మార్చి 23న విడుదలవుతుంది. సినిమాని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు. సాయికార్తీక్ మాట్లాడుతూ.... తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్ టూర్ ప్లాన్ చేశాం. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో బెస్ట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు అని కన్నెగంటి మాట్లాడుతూ.... పదాలకే పరిమితం కానీ జెన్యూన్ డిఫరెంట్ మూవీ ఈ చిత్రం. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సందీప్ తో సినిమా చేయడం హ్యపీగా ఉంది. టెక్నికల్ గా సౌండ్ మూవీ. మంచి సినిమా, కొత్త సినిమాను చూడాలనుకునే మూవీ లవర్స్ కు కచ్చితంగా నచ్చే సినిమా. సందీప్, బాబీ సింహా, అనీషా అంబ్రోస్ కీలకపాత్రల్లో నటించారు. మాతృకలో నటించిన బాబీసింహగారు తెలుగు రీమేక్ లో కూడా అద్భుతంగా నటించారు. అందరీ నటీనటుల పెర్ ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more