Allu Arjuns Sarainodu's blockbuster song promo released

Allu arjuns sarainodu s blockbuster song promo released

Allu Arjun, Sarainodu, blockbuster song, Sarainodu item song, sarainodu blockbuster song

Allu Arjun and Boyapati Srinus Sarainodi item song blockbuster released from Allu Arjuns offical page.

అల్లు అర్జును సరైనోడి బ్లాక్ బస్టర్. ఐటమ్ సాంగ్(వీడియో)

Posted: 03/26/2016 11:48 AM IST
Allu arjuns sarainodu s blockbuster song promo released

అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు టీజర్ ఇప్పటికే దుమ్మురేపింది. ఇక తాజాగా అల్లు అర్జున్ సరైనోడు సినిమాలోని ఐటం సాంగ్ ను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. బ్లాఖ్ బస్టర్ అంటూ సాగే ఈ పాట నిజంగా బ్లాక్ బస్టర్ పాటనే. ముందుగా ఐటమ్ సాంగ్ ను విడుదల చేసిన అల్లు అర్జున్ సాంగ్ ప్రోమో అదిరింది. అంజలి ఇందులో హాట్ హాట్ గా కనిపించింది. ఎర్రతోలు చూసి క్లాస్ అనుకుంటున్నావేమో...మాస్ ఊర మాస్ అంటూ టీజర్ లో తన మాస్ పవర్ ను చూపించిన అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాట కూడా మాస్ బీట్ తో అదిరింది.


సరైనోడులో ఐటం సాంగ్ ఎలా ఉంటుందా అని అనుకున్న అభిమానులకు బ్లాక్ బస్టర్ పాట ప్రోమో బాగా ఆకట్టుకుంది. నేను చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే అంటూ అంజలి గురించి అల్లు అర్జున్ పాడినా కానీ అది సినిమా గురించే అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా ఆడియో ఎప్పుడు, ఎక్కడ అన్న దాని మీద ప్రస్తుతానికి క్లారిటీ లేకున్నా కానీ త్వరలోనే ఈ సినిమా ధియేటర్లలో సందడి చెయ్యనుంది. ఎనర్జిటిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కు మరోసారి మాస్ హీరోగా చూపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles